Weather Update: వచ్చే మూడు రోజులు ఆ జిల్లాల్లో భారీ వర్షాలు.. !

రాయలసీమ నుంచి పశ్చిమ మధ్య బంగాళాఖాతం మీదుగా మధ్య బంగాళాఖాతం వరకు ద్రోణి కొనసాగుతోందని వాతావరణ శాఖ తెలిపింది. ఇది సముద్రమట్టానికి 3.1 నుంచి 5.8 కిలోమీటర్ల ఎత్తులో ఉందని ప్రకటించింది. దీని ప్రభావంతో తెలంగాణలో వచ్చే మూడు రోజులు తెలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఆదివారం సాయంత్రం నుంచి వర్షాలు కురుసే అవకాశం ఉన్నట్లు పేర్కొంది.

వర్షం కురిసే సమయంలో ఉరుములు, మెరుపులు గంటకు 30-40 కి.మీతో ఈదురు గాలులు వస్తాయని పేర్కొంది. కొన్ని చోట్ల పిడుగులు పడే అవకాశం ఉందని హెచ్చరించింది. ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది.

The Meteorological Department has predicted heavy rains in Telangana for the next three days

సోమవారం నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, ములుగు, ఆదిలాబాద్, కొమరం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, మహబూబాబాద్, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, కామారెడ్డి జిల్లాలలో వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.

ఆదివారం సాయంత్రం కరీంనగర్ జిల్లాలోని పలు ప్రాంతాల్లో వర్షం కురిసింది. ఈదురు గాలులతో కూడిన వాన పడింది. తెలంగాణలో ఇదే వాతావరణ పరిస్థితి వరుసగా మూడు రోజులు కొనసాగనుందని అంచనా వేసింది. తెలంగాణ వ్యాప్తంగా రుతుపవనాలు విస్తరించాయని పేర్కొంది. ద్రోణికి తోడు రుతుపవనాలు ఉండడంతో వర్షాలు కురిసే అవకాశం ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+