గదికి తీసుకొచ్చి బ్యూటీషియన్‌పై గ్యాంగ్‌రేప్‌కు యత్నం: నిందితుల్లో ఎమ్మెల్సీ కుమారుడు
నగర శివార్లలో దారుణ ఘటన చోటు చేసుకుంది. బంజారాహిల్స్‌కు చెందిన ఓ బ్యూటీషియన్‌పై ముగ్గురు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి యత్నించారు. దీంతో బాధిత యువతి పోలీసులను ఆశ్రయించింది.
హైదరాబాద్: నగర శివార్లలో దారుణ ఘటన చోటు చేసుకుంది. బంజారాహిల్స్‌కు చెందిన ఓ బ్యూటీషియన్‌పై ముగ్గురు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి యత్నించారు. దీంతో బాధిత యువతి పోలీసులను ఆశ్రయించింది.
యువతి వాంగ్మూలం తీసుకున్న పోలీసులు.. నిందితులు ప్రీతంరెడ్డి, అరవరెడ్డిపై కేసులు నమోదు చేశారు. కాగా, ముగ్గురు నిందితుల్లో ఒకరు.. ఓ ఎమ్మెల్సీ కుమారుడు కావడం గమనార్హం.

బాధితురాలు ఫిర్యాదు మేరకు ఘటన వివరాలిలా ఉన్నాయి... కొంపల్లిలోని ఫాంమెడోస్‌లో నివసించే ప్రీతంరెడ్డి (26)కి బంజారాహిల్స్‌లో బ్యూటీషియన్‌గా పనిచేసే బాధిత యువతి(23) ఇటీవల ఓ పబ్‌లో పరిచయమైంది. దీంతో ఆమెను వివాహం చేసుకుంటానని పలుమార్లు సందేశాలు పంపాడు. ఆ తర్వాత ఆమెతో ఫోన్ సంభాషణ మొదలెట్టాడు.
కాగా, మే 5వ తేదీన ఇంట్లో ఎవరూలేరని ఇంటికి రావాలని ఆ యువతిని కోరాడు. పదేపదే ఫోన్ చేశాడు. దీంతో మే 6న మధ్యాహ్నం కారులో తన గదికి తీసుకువచ్చి అత్యాచారం చేశాడు. అనంతరం గదిలో పెట్టి తన ఇరువురు స్నేహితులను తీసుకువచ్చి వారి కోరికను తీర్చాలని బలవంతపెట్టాడు. ముగ్గురు కలిసి యువతిని కారులో ఎక్కించుకుని దుర్భాషలాడుతూ అసభ్యకరంగా ప్రవర్తించారు.
తన వద్ద డబ్బు లేకపోవడంతో లేకపోవడంతో జిమ్‌లోని ఓ యువతి వద్ద రూ.400 తీసుకుని బాధిత యువతి ఆటోలో ఇంటికి వెళ్లింది. అనంతరం జరిగిన ఘటనపై యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆదివారం సాయంత్రం ఫాంమెడోస్‌లోని సంఘటనా స్థలాన్ని క్రైం డీసీపీ జానకీషర్మిల, పేట్‌బషీరాబాద్ ఏసీపీ అందె శ్రీనివాసరావు పరిశీలించారు. బాధితురాలు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.












Click it and Unblock the Notifications