చోరీ ఘటనలో ట్విస్ట్: నోట్లో యాసిడ్ పోసుకుని డ్రామా
హైదరాబాద్: సికింద్రాబాదులోని నగరంలోని నేరేడ్‌మెట్‌లో జరిగిన చోరీ ఘటనలో మలుపు తిరిగింది. బాధితుడే గాయపర్చుకుని బంగారం చోరీకి గురైనట్టు తప్పుడు ఫిర్యాదు చేసి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. బంగారం కాజేసేందుకు నాటకం ఆడినట్టు అనుమానిస్తున్నారు.
మోహన్ గత కొంతికాలంగా స్థానికంగా ఉంటున్న జ్యువెలరీ షాపుల్లో బంగారం తీసుకుని నగలు తయారు చేస్తుండేవాడు. ఇదే క్రమంలో నిన్న సాయి బాలాజీ దుకాణంలో కొంత బంగారాన్ని తీసుకుని వెళ్తున్న క్రమంలో ఇద్దరు బైక్‌పై వచ్చి తనపై యాసిడ్ దాడి చేసి బంగారాన్ని దోచుకెళ్లారని పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

అయితే ఆ బంగారాన్ని మోహనే కాజేసినట్లు పోలీసులు గుర్తించారు. ప్రస్తుతం కుషాగుడలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మోహన్ పరిస్థితి మెరుగ్గా ఉంది. మోహన్ కోలుకున్న అనంతరం విచారించనున్నట్లు పోలీసులు చెబుతున్నారు.
నోట్లో యాసిడ్ పోసి దొంగతనం చేసిన ఘటన సికింద్రాబాదులోని నేరేడ్‌మెట్టులో దుండుగులు చోరీకి పాల్పడినట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. శుక్రావంర మధ్యాహ్నం నేరెడ్‌మెట్‌లో చోటు చేసుకున్న ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూసిందని భావించారు.
నేరెడ్‌మెట్ పరిధిలోని శ్రీసాయి బాలాజీ జ్యువెల్లర్స్ దుకాణంలోకి శుక్రవారంనాడు మధ్యాహ్నం దోపిడీ దొంగలు ప్రవేశించారని, మోహన్ నోట్లో యాసిడ్ పోసి బంగారం నగలను అపహరించారని భావించారు.












Click it and Unblock the Notifications