అలయ్ బలయ్ అంటే తెలుసా?: 'దత్తాత్రేయ ప్రజల మనిషి', ప్రధాని మోడీ సందేశం

హైదరాబాద్: అలయ్ బలయ్ ఓ అధ్భుతమైన కార్యక్రమని కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు అన్నారు. కేంద్ర కార్మికశాఖ మంత్రి బండారు దత్తాత్రేయ ఆధ్వర్యంలో నగరంలోని జలవిహార్‌లో నిర్వహించిన అలయ్ బలయ్ కార్యక్రమంలో శుక్రవారం ఆయన పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మంత్రి వెంకయ్య నాయుడు మాట్లాడుతూ అందరిలో సోదరభావం పెంపొందించే కార్యక్రమమే అలయ్‌ బలయ్‌ అన్నారు. దత్తాత్రేయ ప్రజల మనిషి అని కొనియాడారు. అన్ని పార్టీల వారితో స్నేహపూర్వకంగా మెలగడం దత్తాత్రేయకే చెల్లిందన్నారు.

కార్మికులకు కనీస ఫించన్ రూ. 1000 చేసిన ఘటన దత్తాత్రేయదేనన్నారు. దత్తాత్రేయ లాంటి వ్యక్తి నాకు సహచరుడి ఉండటం అదృష్టంగా భావిస్తున్నానన్నారు. బడుగు బలహీన వర్గాలకు వెన్నుదన్నుగా నిలిచే వ్యక్తి దత్తాత్రేయ అంటూ కొనియాడారు.

అలయ్ బలయ్ అంటే తెలుసా?: 'దత్తాత్రేయ ప్రజల మనిషి', ప్రధాని మోడీ సందేశం

అలయ్ బలయ్ అంటే తెలుసా?: 'దత్తాత్రేయ ప్రజల మనిషి', ప్రధాని మోడీ సందేశం

అందరినీ ఒకే వేదికపైకి తీసుకురాగలిగే ఏకైక వ్యక్తి దత్తాత్రేయ మాత్రమే అన్నారు. రాజధాని అమరావతి శంకుస్థాపన సందర్భంగా తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఒకే వేదికను పంచుకోవడం శుభపరిణామమన్నారు.

అలయ్ బలయ్ అంటే తెలుసా?: 'దత్తాత్రేయ ప్రజల మనిషి', ప్రధాని మోడీ సందేశం

అలయ్ బలయ్ అంటే తెలుసా?: 'దత్తాత్రేయ ప్రజల మనిషి', ప్రధాని మోడీ సందేశం

ఈ కార్యక్రమానికి హాజరైన తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ నరసింహాన్ మాట్లాడుతూ అలయ్ బలయ్ కార్యక్రమంలో పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు. ఇరు రాష్ట్రాల్లోని రాజకీయ నేతలంతా ఒక్కటయ్యే వేదిక అలయ్ బలయ్ మాత్రమేనని అన్నారు.

అలయ్ బలయ్ అంటే తెలుసా?: 'దత్తాత్రేయ ప్రజల మనిషి', ప్రధాని మోడీ సందేశం

అలయ్ బలయ్ అంటే తెలుసా?: 'దత్తాత్రేయ ప్రజల మనిషి', ప్రధాని మోడీ సందేశం

అలయ్‌ బలయ్‌ అంటే ఆత్మీయ ఆలింగనం అని కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ అన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అలయ్ బలయ్ కార్యక్రమం జరుపుకోవడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. గత 12ఏళ్లుగా ఈ కార్యక్రమాన్ని జరుపుతున్నామన్నారు.

అలయ్ బలయ్ అంటే తెలుసా?: 'దత్తాత్రేయ ప్రజల మనిషి', ప్రధాని మోడీ సందేశం

అలయ్ బలయ్ అంటే తెలుసా?: 'దత్తాత్రేయ ప్రజల మనిషి', ప్రధాని మోడీ సందేశం

వర్గ, వర్ణ, ప్రాంత భేదాలు లేకుండా అందరిని ఒకే వేదికపైకి తీసుకురావడమే అలయ్ బలయ్ ప్రధాన ఉద్దేశమన్నారు. అమరావతి శంకుస్థాపనలో భాగంగా తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులిద్దరూ చేతులు కలపడం శుభపరిణామనన్నారు.

అలయ్ బలయ్ అంటే తెలుసా?: 'దత్తాత్రేయ ప్రజల మనిషి', ప్రధాని మోడీ సందేశం

అలయ్ బలయ్ అంటే తెలుసా?: 'దత్తాత్రేయ ప్రజల మనిషి', ప్రధాని మోడీ సందేశం

దత్తాత్రేయ ఆధ్వర్యంలో నిర్వహించిన అలయ్ బలయ్ కార్యక్రమానికి ప్రధాని నరేంద్రమోడీ తన సందేశాన్ని పంపించారు. ఈ కార్యక్రమం ఐక్యతకు చిహ్నంమని ప్రధాని కొనియాడారు. ప్రముఖ విద్యావేత్త చుక్కారామయ్య మాట్లాడుతూ అలయ్ బలయ్ గొప్ప వంతెన లాంటిదని కొనియాడారు.

అలయ్ బలయ్ అంటే తెలుసా?: 'దత్తాత్రేయ ప్రజల మనిషి', ప్రధాని మోడీ సందేశం

అలయ్ బలయ్ అంటే తెలుసా?: 'దత్తాత్రేయ ప్రజల మనిషి', ప్రధాని మోడీ సందేశం

ఇలాంటి కార్యక్రమాల వల్ల అందరిలో ఐక్యత ఏర్పడుతుందని తెలిపారు. ఇటువంటి కార్యక్రమం మరో వందేళ్లు కొనసాగాలని ఆశీర్వదించారు. దత్తాత్రేయ నిర్వహించిన అలయ్‌ బలయ్‌ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు సందడి చేశారు.

అలయ్ బలయ్ అంటే తెలుసా?: 'దత్తాత్రేయ ప్రజల మనిషి', ప్రధాని మోడీ సందేశం

అలయ్ బలయ్ అంటే తెలుసా?: 'దత్తాత్రేయ ప్రజల మనిషి', ప్రధాని మోడీ సందేశం

కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు, తెలంగాణ మంత్రులు మహమూద్‌ అలీ, నాయిని నర్శింహారెడ్డి. ఈటల రాజేందర్‌, సీఎల్పీ నేత జానారెడ్డి, తెదేపా నేతలు రమణ, ఎర్రబెల్లి దయాకర్‌రావు, రేవంత్‌రెడ్డి, భాజపా ఎమ్మెల్యే లక్ష్మణ్‌, ఎంపీ జితేందర్‌రెడ్డి, సినీనటులు రాజేంద్రప్రసాద్‌, వేణుమాధవ్‌, జీవిత, ప్రముఖ కమెడియన్ అలీ తదితరులు హాజరయ్యారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+