అలర్ట్: తెలంగాణలో వాహనాల పొల్యూషన్ టెస్టింగ్ ఫీజు పెంపు, ఏ వాహనానికి ఎంతంటే?
హైదరాబాద్: తెలంగాణ వాహనదారులకు ఇది కొంత చేదువార్తే. ఎందుకంటే.. రాష్ట్రంలో వాహనాల పొల్యూషన్ టెస్టింగ్ పరీక్ష ఫీజును పెంచాలని నిర్ణయించినట్లు తెలంగాణ రవాణా శాఖ వెల్లడించింది. ఇక నుంచి వాహనాన్ని పరీక్షించి సర్టిఫికెట్‌ను జారీ చేసేందుకు టీవీలర్ వాహనానికి రూ. 50, పెట్రోల్ త్రీ వీలర్స్‌కు రూ. 60, పెట్రోల్ కార్లకు రూ. 75, డీజిల్ కార్లకు రూ. 100, డీజిల్‌లో ఇతర కేటగిరీ వాహనాలన్నింటికీ రూ. 100 చొప్పున ఫీజు వసూలు చేయనున్నట్లు రవాణా శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.
ఈ మేరకు రవాణా శాఖ జీవో నెంబర్ 23ను విడుదల చేసింది. ప్రస్తుతం ఏడేళ్ల క్రితం ఉన్న ఛార్జీలనే అమలు చేస్తున్నారన్నారు. అయితే, ఈ ఏడేళ్లలో వేతనాలు, ఇతర వ్యయాలు పెరిగాయని.. అందుకే పొల్యూషన్ టెస్టింగ్ ఫీజు పెంచుతున్నట్లు ఉత్తర్వులు పేర్కొన్నారు.

స్కూల్ బస్సులపై ఆర్టీఏ కొరఢా: పిట్నెస్ లేని బస్సులు సీజ్
రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలలు తిరిగి ప్రారంభమవుతున్న క్రమంలో ప్రైవేటు బస్సులను రవాణా శాఖ అధికారులు తనిఖీ చేశారు. రంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా స్కూల్ బస్సులను రవాణా శాఖ అధికారులు తనిఖీ నిర్వహించారు. నిబంధనలు ఉల్లంఘించిన బస్సులను అధికారులు సీజ్ చేశారు. మరికొన్ని ప్రాంతాల్లోనూ తనిఖీలు చేశారు.
వనస్థలిపురంలో స్కూల్ బస్సులను తనిఖీ చేసిన ఆర్టీఏ అధికారులు.. నిబంధనలకు విరుద్ధంగా నడుపుతున్న 2 బస్సులను సీజ్ చేశారు. రాజేంద్రనగర్‌లో మూడు బస్సులు సీజ్ చేశారు. ఫిట్నెస్, ఇన్స్యూరెన్స్, పర్మిట్, పొల్యూషన్, డ్రైవింగ్ లైసెన్స్, ఫస్ట్ ఎయిడ్ బాక్స్ వంటి వాటిని కూడా క్షుణ్ణంగా పరీక్షిస్తున్నారు అధికారులు. ఈ తనిఖీల్లో వివిధ పాఠశాలలకు చెందిన మొత్తం ఆరు బస్సులను సీజ్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ తనిఖీలు కొనసాగుతున్నాయి.
-
గ్యాస్ కొరత కష్టాలు, నిలిచిపోయిన బుకింగ్ - ఇక సిలిండర్ దక్కాలంటే..!! -
అలా చేస్తే గ్యాస్ ఏజెన్సీల లైసెన్సులు రద్దు.. వారికి మంత్రి మాస్ వార్నింగ్! -
మండుటెండల్లో చల్లని ఉపశమనం.. తెలంగాణాకు వర్షాలున్నాయన్న ఐఎండీ! -
హైదరాబాద్ లో సెకండ్ కేబుల్ బ్రిడ్జ్.. ఎక్కడో తెలుసా..? -
హైదరాబాద్ లో హాలీవుడ్.. నెట్‌ఫ్లిక్స్ ఐలైన్ స్టూడియో ప్రారంభించి సీఎం రేవంత్ వ్యాఖ్యలు! -
కేంద్రం ముందు అయిదు ప్రతిపాదనలు పెట్టిన కేటీఆర్ -
ఉగాది నుంచి వృషభరాశి, మేషరాశి వారి జాతక ఫలం -
రైతులకు శుభవార్త.. రైతు భరోసాపై కీలక ప్రకటన చేసిన మంత్రి! -
భారత్‌పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
విద్యార్థులకు శుభవార్త.. ఒంటిపూట బడులపై విద్యాశాఖ ప్రకటన, ఎప్పటినుండి అంటే












Click it and Unblock the Notifications