50 ఉచిత వాహనాలు
హైదరాబాద్: ప్రభుత్వాసుపత్రుల్లో ప్రసవాలను పెంచేందుకు త్వరలో అమ్మ ఒడి 102 వాహనాలను ప్రారంభిస్తామని మంత్రి లక్ష్మారెడ్డి వెల్లడించారు. పేదల మృతదేహాలను వారి ఇళ్లకు చేర్చడానికి ప్రభుత్వం 50 ఉచిత వాహనాలను ఏర్పాటు చేసిందని ఆయన ప్రకటించారు. గాంధీ ఆస్పత్రిలో ఈ వాహనాలను డిప్యూటీ సీఎం మహమూద్ ఆలీ, మంత్రులు లక్ష్మారెడ్డి, తలసాని, పద్మారావు కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ మాట్లాడుతూ ప్రభుత్వ ఆసుపత్రుల్లో మరణించిన వారి మృతదేహాలను ఉచితంగా వారి ఇంటికి చేరవేసేందుకు వీలుగా పార్థివ వాహానాలను ప్రభుత్వం ప్రవేశ పెట్టిందన్నారు.












Click it and Unblock the Notifications