దెబ్బకు దిగొచ్చిన వేణు స్వామి

ప్రముఖ జ్యోతిషుడు వేణు స్వామి గురించి తెలియని వారు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉండరంటే అతిశేయోక్తి కాదు. సినీ , రాజకీయ ప్రముఖుల జాతకాల గురించి చెబుతూ బాగా ఫేమస్ అయ్యారాయన. ముఖ్యంగా నాగ చైతన్య, సమంత జంట వీడిపోతారని ముందుగానే చెప్పి సంచలనం స‌ృష్టించారు. ఆ తర్వాత మెగా డాటర్ నిహారిక విడాకులు, రెబల్ స్టార్ ప్రభాస్ ఆదిపురుష్ సినిమా ఫ్లాప్ గురించి ముందే చెప్పి సోషల్ మీడియాలో ఫుల్ పాపులారిటీని సంపాదించకున్నారాయన.

వీరితో పాటు పలువురు సెలబ్రిటీల గురించి వేణు స్వామి చెప్పినవి చెప్పినట్టుగా జరగడంతో..సోషల్ మీడియాలో ఆయన పెద్ద సెలబ్రిటీగా మారిపోయారు. డింపుల్ హయాతి, రష్మిక, నిధి ఆగర్వాల్ వంటి హీరోయిన్లు వేణు స్వామి చేత జాతక దోష నివారణ పూజలు చేయించుకున్నారంటే ఆయన ప్రభావం ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. అయితే ఆయన ఎన్నికల్లో విషయంలో చెప్పిన జాతకాలు ఫెయిల్ కావడంతో తీవ్ర విమర్శలను మూటగట్టుకున్నారు.

Venu Swamy apologized for his comments on Naga Chaitanya and Sobithala s personal life

తెలంగాణలో కేసీఆర్, ఏపీలో జగన్‌లు సీఎం అవుతారని చెప్పిన వేణు స్వామి జాతకం తప్పని తేలాయి. దీంతో ఆయనపై నెటిజన్లు ఓ రేంజ్‌లో ఫైర్ అయ్యారు. దీంతో ఇక మీదట తాను ప్రిడిక్షన్ చెప్పనని తేల్చేశారు. ఒకపక్క ఆయన జాతకాలు ఫెయిల్ అవుతున్నాయని తెలిసినప్పటికీ సెలబ్రిటీలు ఆయన్ను మాత్రం వదలడం లేదు. ఇదిలా ఉంటే సమంతతో విడాకుల తీసుకున్న తర్వాత హీరోయిన్ శోభిత ధూళిపాళను నాగ చైతన్య వివాహం చేసుకున్నారు. అయితే నాగచైతన్య, శోభితలు కూడా ఎక్కువ కాలం కలిసి ఉండరని చెప్పి పెద్ద షాకే ఇచ్చారాయన. వేణు స్వామి వ్యాఖ్యలపై మహిళా కమిషన్‌కి ఫిలిం జర్నలిస్ట్ యూనియన్ అసోసియేషన్ సభ్యులు ఫిర్యాదు చేశారు.

దీనిపై వేణు స్వామికి తెలంగాణ మహిళా కమిషన్ నోటీసులు జారీ చేసింది. మహిళా కమిషన్ నోటీసులను సవాలు చేస్తూ వేణు స్వామి హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టులో వేణు స్వామికి గట్టి ఎదురు దెబ్బ తగిలింది. ఉమెన్ కమిషన్ ముందు హాజరు కావాల్సిందేనని వేణు స్వామికి హైకోర్టు తేల్చి చెప్పింది.హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో వేణు స్వామికి ఉమెన్ కమిషన్ మరొసారి నోటీసులు జారీ చేసింది. మంగళవారం మహిళా కమిషన్‌ ముందు హాజరైన వేణు స్వామి, తాను గతంలో నాగచైతన్య, శోభితల వ్యక్తిగత జీవితంపై చేసిన వ్యాఖ్యలకు క్షమాపణలు కోరారు. దీంతో ఇలాంటి వ్యాఖ్యలు మళ్లీ పునరావృతం కావొద్దని ఉమెన్ కమిషన్ వేణు స్వామిని హెచ్చరించింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+