ఆలస్యం: ఇప్పట్లో వరంగల్ ఉపఎన్నిక లేనట్లే, గద్దర్‌పై రెండు రోజుల్లో స్పష్టత

హైదరాబాద్: బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్‌ను ప్రధాన కమిషనర్ నసీం జైదీ బుధవారం ప్రకటించారు. పనిలో పనిగా ఖాళీగా ఉన్న వరంగల్ పార్లమెంట్ స్ధానానికి కూడా షెడ్యూల్‌ని ప్రకటిస్తారని అందరూ భావించారు. అయితే వరంగల్ ఉపఎన్నికపై ఎన్నికల కమిషన్ ఎలాంటి షెడ్యూల్‌ను ప్రకటించకపోవడంతో రాజకీయ వర్గాల్లో చర్చ మొదలైంది.

దీంతో వరంగల్ పార్లమెంట్ స్ధానానికి ఇప్పట్లో ఉప ఎన్నిక జరిగేలా పరిస్థితులు కనిపించడం లేదు. బుధవారం నోటిఫికేషన్ రాకపోవడంతో రాజకీయ పార్టీలు తమ వ్యూహాన్ని రచించుకోవడానికి మరికాస్త సమయం దక్కిందని రాజకీయ నిపుణులు అంటున్నారు.

గతేడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వరంగల్ లోక్‌సభ నియోజక వర్గం నుంచి టీఆర్ఎస్ పార్టీ తరుపున గెలిచిన కడియం శ్రీహరి తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గంలో ఉపముఖ్యమంత్రి పదవి వరించింది. దీంతో ఆయన ఎమ్మెల్సీగా గెలుపొందారు. ఈ నేపథ్యంలో ఆయన తన ఎంపీ పదవికి రాజీనామా చేశారు.

 warangal parliamentary by poll election schedule not announced

జులై 21న ఆయన రాజీనామాకు లోక్‌సభ స్పీకర్ ఆమోదం తెలపడంతో వరంగల్ పార్లమెంట్ స్ధానం ఖాళీ అయింది. ఎన్నికల చట్ట ప్రకారం ఏదైనా పార్లమెంట్ సీటు ఖాలీ ఆయితే ఆరు నెలల వ్యవధిలో తిరిగి ఉపఎన్నిక నిర్వహించాల్సి ఉంది. ఇది ఇలా ఉంటే వరంగల్ ఎంపీ స్థానానికి జరగనున్న ఉప ఎన్నికలో కమ్యూనిస్టు పార్టీల అభ్యర్ధిగా ప్రజానాయకుడు గద్దర్ పోటీ చేస్తాడనే వార్తలు వస్తున్నాయి.

అయితే గద్దర్ పోటీ చేస్తాడా లేదా అన్నది మరో రెండు రోజుల్లో స్పష్టత వస్తుందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. బుధవారం నల్గొండ జిల్లాలో జరిగిన సీపీఎం విస్తృతస్థాయ సమావేశానికి ఆయన హాజరయ్యారు. ఆనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో 1400 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నా కేసీఆర్‌ పట్టించుకోకపోవడం దారుణమన్నారు.

రాష్ట్రంలో కేసీఆర్ ప్రవేశపెట్టిన పథకాలన్నీ ప్రచార ఆర్భాట పథకాలేనన్నారు. స్వచ్ఛ తెలంగాణ పోయి దత్తత తెలంగాణ అంటున్నారని మండిపడ్డారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+