డ్రగ్‌కేసులో‌ ఛార్మిపై ఇలా: అలోవెరా డ్రింక్ తాగొస్తున్నారు

డ్రగ్స్ కేసు విచారణకు వచ్చే సినీ ప్రముఖులు అలోవెరా డ్రింక్ తాగొస్తున్నారని ఎక్సైజ్ అధికారులు అభిప్రాయపడుతున్నారు. ఈ డ్రింక్ తాగడం వల్ల కడుపు శుభ్రమౌతోందనే వారు అభిప్రాయపడుతున్నారు.

హైదరాబాద్: డ్రగ్స్ కేసు విచారణకు వచ్చే సినీ ప్రముఖులు అలోవెరా డ్రింక్ తాగొస్తున్నారని ఎక్సైజ్ అధికారులు అభిప్రాయపడుతున్నారు. ఈ డ్రింక్ తాగడం వల్ల కడుపు శుభ్రమౌతోందనే వారు అభిప్రాయపడుతున్నారు.ఈ కేసులో సినీ నటి చార్మి అనవసరంగా కోర్టును ఆశ్రయించిందని ఎక్సైజ్ శాఖకు చెందిన ఉన్నతాధికారులు అభిప్రాయపడుతున్నారు.

డ్రగ్ కేసు విషయమై ఎక్సైజ్‌శాఖకు చెందిన ఉన్నతాధికారులు మంగళవారంనాడు మధ్యాహ్నం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని కలిశారు.ఈ విషయమై వారు సిఎస్‌తో చర్చించారు. ఈ సందర్భంగా అధికారులు మీడియాతో చిట్‌చాట్ చేశారు.

డ్రగ్స్ కేసు విషయమై రోజుకో సినీ ప్రముఖుడి పేరు బయటకు వస్తోంది.అయితే ఈ కేసు విషయమై సినీ పరిశ్రమను లక్ష్యంగా చేసుకొన్నట్టు వస్తున్న ఆరోపణలను ఎక్సైజ్ అధికారులు ఖండించారు.ఈ కేసుతో సంబంధం ఉన్నట్టు సమాచారం ఉన్నవారందరిని విచారిస్తున్నట్టు చెప్పారు.

కెల్విన్ సహ ఇతర నిందితులు ఇచ్చిన సమాచారం మేరకు విచారణ సాగిస్తున్నట్టు ఎక్సైజ్ వర్గాలు చెబుతున్నాయి.ఇప్పటివరకు 28 మందిని విచారించారు. అంతేకాదు 19 మందిని అరెస్టుచేశారు. ఆరుగురు కీలకమైన నిందితులుగా ఉన్నారని ఎక్సైజ్ అధికారులు అభిప్రాయపడుతున్నారు.

అలోవెరా డ్రింక్ తాగి వస్తున్నారు

అలోవెరా డ్రింక్ తాగి వస్తున్నారు

సినీ ప్రముఖులు విచారణకు వచ్చే సమయంలో అలోవెరా డ్రింక్ తాగి వస్తున్నారని ఎక్సైజ్‌శాఖాధికారులు అభిప్రాయపడుతున్నారు. ఈ డ్రింక్ తాగడం వల్ల కడుపు శుభ్రంగా మారే అవకాశం ఉందని వారు అభిప్రాయపడుతున్నారు. డ్రగ్ కేసుకు సంబంధించి విచారణకు హజరైనవారు సినీ రంగానికి చెందిన ప్రముఖులను పేర్లను వెల్లడిస్తున్నారని ఎక్సైజ్ అధికారులు అభిప్రాయపడుతున్నారు. అయితే విచారణను అంతా రికార్డు చేస్తున్న విషయాన్ని వారు గుర్తుచేశారు.

Recommended Video

    Anchors Names Out In Tollywood Drug Scandal
    డోపింగ్‌టెస్ట్ మిషన్ల ద్వారా పరీక్షలు

    డోపింగ్‌టెస్ట్ మిషన్ల ద్వారా పరీక్షలు

    డ్రగ్స్ కేసు విచారణలో మరింత లోతుగా విచారణ చేయాలని ఎక్సైజ్ అధికారులు భావిస్తున్నారు.ఈ మేరకు అథ్లెటిక్ డోపింగ్ టెస్ట్ మిషన్లను కూడ తెప్పించి పరీక్షలు నిర్వహించాలనే యోచనలో అధికారులున్నారు. ఢిల్లీ నుండి ఈ మిషన్లను తెప్పించి పరీక్షలు నిర్వహించడం వల్ల ప్రయోజనం ఉంటుందని వారు భావిస్తున్నారు. ఈ డోపింగ్ మిషన్ల ద్వారా పరీక్షలు నిర్వహించడం ద్వారా ఖచ్చితమైన ఆధారాలు దొరికే అవకాశం ఉంటుందని ఎక్సైజ్ అధికారులు అభిప్రాయంతో ఉన్నారు.అయితే ఈ మిషన్లను ఎప్పటివరకు తీసుకువస్తారనే విషయమై ఇంకా స్పష్టత రాలేదు.

    ఛార్మి కోర్టుకు వెళ్ళడంపై ఇలా

    ఛార్మి కోర్టుకు వెళ్ళడంపై ఇలా

    సినీ నటి ఛార్మి అనవసరంగా కోర్టుకు వెళ్ళారనే అభిప్రాయాన్ని ఎక్సైజ్ అధికారులు వ్యక్తం చేస్తున్నారు. ఛార్మికి నోటీసులు జారీ చేశాం, కానీ, ఆమెను నిందితురాలు అనలేదనే విషయాన్ని ఎక్సైజ్‌శాఖాధికారులు గుర్తుచేస్తున్నారు. ఇచ్చిన నోటీసులో కూడ ఎక్కడ కోరితే అక్కడే విచారణ చేస్తామని చెప్పిన విషయాన్ని ఎక్సైజ్ అధికారులు గుర్తుచేస్తున్నారు.

     ప్రాంతీయ సమస్యలను సృష్టిస్తున్నారు

    ప్రాంతీయ సమస్యలను సృష్టిస్తున్నారు

    డ్రగ్స్ కేసు విషయమై ప్రాంతీయ సమస్యలను ముందుకు తెస్తున్నారని కూడ ఎక్సైజ్ అధికారులు అభిప్రాయపడుతున్నారు. ఈ కేసుకు ప్రాంతాలతో ఎలాంటి సంబంధం లేదన్నారు. అయితే ఈ కేసునుండి తప్పించుకొనేందుకుగాను ప్రాంతాలను ముందుకు తెస్తున్నారని వారు అభిప్రాయపడుతున్నారు. విచారణకు హజరైన వారి నుండి ఎవరి నుండి కూడ బలవంతంగా శాంపిళ్ళను సేకరించలేదంటున్నారు అధికారులు.

    సినీ పెద్దలే లీకులుస్తున్నారు

    సినీ పెద్దలే లీకులుస్తున్నారు


    డ్రగ్స్ తీసుకొనే అలవాటు ఎవరెవరికి ఉందనే విషయమై సినీ పరిశ్రమకు చెందిన పెద్దలే లీకులుస్తున్నారని ఎక్సైజ్‌శాఖాధికారులు చెబుతున్నారు.అయితే దానిపై ఇండస్ట్రీలోని వారే ఎక్సైజ్ అధికారులకు సమాచారం అందిస్తున్నారనే ప్రచారం కూడ లేకపోలేదు. అయితే ఎవరు లీకులు ఇస్తున్నారనే విషయాన్ని మాత్రం ఎక్సైజ్ అధికారులు గోప్యంగా ఉంచుతున్నారు.అయితే ఈ వ్యవహరం మాత్రం సినీ పరిశ్రమలో సంచలనంగా మారింది.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+