వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని భర్తను చంపిన భార్య
హైదరాబాద్: భార్య అక్రమ సంబంధం నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని ఓ మహిళ కట్టుకున్న భర్తనే హత్య చేయించిన ఘటన నిజామాబాద్ జిల్లా వర్ని మండలం పొట్టిగిత్తగుట్ట గ్రామంలో చోటుచేసుకుంది.
దీనికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. గ్రామానికి చెందిన శివలాల్ (28), జ్యోతి భార్యభర్తలు. వీరిద్దరి మధ్య గత కొంతకాలంగా గొడవలు జరుగుతున్నాయి. అదే గ్రామంలో ఉన్న మరొక వ్యక్తితో జ్యోతి వివాహేతర సంబంధాన్ని కొనసాగిస్తుందని తెలుసుకున్న భర్త ఆమెను నిలదీశాడు.

దీంతో వారిద్దరి మధ్య తరచూ గొడవలు జరుగుతూ ఉండేవి. ఈ నేపథ్యంలో తన భర్త శివలాల్‌ను అడ్డు తొలగించుకోవాలని జ్యోతి పథకం వేసింది. ఇందులో భాగంగా కొడుకుని పుట్టింటికి పంపింది. సోమవారం రాత్రి మద్యం మత్తులో శివలాల్ ఇంటికి వచ్చి నిద్రిస్తుండగా, కాళ్లు చేతులు కట్టేసి అతడి గొంతు నులిమి హత్య చేసింది.
విషయం తెలుసుకున్న స్ధానికులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో సంఘటనా స్ధలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం సమీప ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.












Click it and Unblock the Notifications