చిత్తుగా తాగేసి భర్తను చంపిన భార్య: మెదక్ ప్రమాదంలో ఇద్దరు మృతి

హైదరాబాద్: మద్యం మత్తులో ఓ మహిళ తన భర్తను పొట్టన పెట్టుకుది. ఈ సంఘటన హైదరాబాదులోని ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని మణికేశ్వరినగర్ వడ్డెరబస్తిలో జరిగింది. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని నిందితురాలిని అదుపులోకి తీసుకున్నారు.

ప్రమాదంలో ఇద్దరు మృతి

మెదక్ జిల్లాలోని పెద్దశంకరం మండలం తిరుమలాపురంలో రోడ్డు ప్రమాదం జరిగింది. బైక్‌ను డీసీఎం వ్యాను ఢీకొనడంతో జరిగిన ఈ ప్రమాదంలో తండ్రి, కూతురు అక్కడికక్కడే మృతి చెందారు. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Murder

జీపునకు అడ్డువచ్చాడని..

వరంగల్ జిల్లా మరిపెడలో పోలీసులు జులుం ప్రదర్శించారు. జీపుకు అడ్డు వచ్చాడని కృష్ణా అనే యువకుడిని ఎస్సై కృష్ణకుమార్ పోలీస్‌ స్టేషన్‌కు తీసుకెళ్లాడు. ఆ తర్వాత కృష్ణను పోలీసులు చితకబాదారు. దీంతో మనస్తాపం చెందిన కృష్ణా సెల్‌టవర్ పైనుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ఎస్సై కృష్ణకుమార్‌పై చర్యలు తీసుకోవాలంటూ పోలీస్‌స్టేషన్ ఎదుట మృతదేహంతో బంధువులు ఆందోళనకు దిగారు.

బాలికల అపహరణకు ప్రయత్నం

మహబూబ్‌నగర్‌లో ఇద్దరు బాలికలను అపహరించేందుకు యత్నించారు. దుండగుల నుంచి తప్పించుకున్న ఒక బాలిక తల్లిదండ్రులకు విషయం తెలపడంతో దుండగుల కోసం గాలించారు. మరో బాలికతో పరారవుతున్న దుండగుడిని కుటుంబసభ్యులు పట్టుకున్నారు.

దుండగుడిపై బాలిక బంధువులు దాడికి యత్నించారు. అడ్డుకున్న పోలీసులు నిందితుడిని అరెస్టు చేసి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. అపహరణ ఘటనపై మహబూబ్‌నగర్ పోలీస్‌స్టేషన్‌లో బాలిక బంధువులు ఫిర్యాదు చేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+