‘‘ఎస్కార్ట్, సెక్యూరిటీ లేకుండా.. ఒంటరిగా గవర్నర్ వద్దకు జగన్ ఎందుకెళ్లారు?’’
ఎస్కార్ట్ వాహనం లేకుండా.. సెక్యూరిటీని రానివ్వకుండా.. స్నేహితుడి కారులో వైయస్ జగన్మోహన్ రెడ్డి రహస్యంగా వెళ్లి గవర్నర్ ను కలవడం వెనుక ఉన్న కారణం బయటపెట్టాలని టీడీపీ నేత వర్ల రామయ్య డిమాండ్ చేశారు.
హైదరాబాద్: తనకిచ్చిన ఎస్కార్ట్ వాహనం లేకుండా.. సెక్యూరిటీని రానివ్వకుండా.. స్నేహితుడి కారులో వైయస్ జగన్మోహన్ రెడ్డి రహస్యంగా వెళ్లి గవర్నర్ ను కలవడం వెనుక ఉన్న కారణం బయటపెట్టాలని టీడీపీ నేత వర్ల రామయ్య డిమాండ్ చేశారు.
ఏ ప్రజా సమస్యపై చర్చించడం కోసం గవర్నర్ అపాయింట్‌మెంట్ ఇచ్చారో జగన్ చెప్పాలని అడగటంతో పాటు ఇంకా పలు ప్రశ్నలను ఆయన సంధించారు. ఎస్కార్ట్ వాహనాన్ని వదిలి సీక్రెట్‌గా వెళ్లాల్సిన అవసరం ఏంటని ప్రశ్నించారు. గవర్నర్‌తో ఏం మాట్లాడారో జగన్ ప్రజలకు చెప్పాలని వర్ల రామయ్య డిమాండ్ చేశారు.

గవర్నర్-జగన్ భేటీపై ప్రశ్నించే హక్కు రాష్ట్ర పౌరుడిగా తనకు ఉందని, కేసుల నుంచి బయటపడే సలహా ఏమైనా గవర్నర్ ను అడిగారా? అని ప్రశ్నించిన ఆయన.. జగన్‌కు న్యాయ స్థానాల్లో అన్ని దారులు మూసుకుపోయాయని, ఇక మిగిలింది జైలు దారేనంటూ ఎద్దేవా చేశారు.
జగన్ కు ఏ విషయంలో అపాయింట్ మెంట్ ఇచ్చారో గవర్నర్ కూడా వెల్లడించాలని వర్ల రామయ్య కోరారు. గవర్నర్ తో చర్చించేంత ప్రజా సమస్యలు జగన్ కు ఏమున్నాయని వ్యాఖ్యానించారు.
నదుల, తుపానుల వల్ల అల్లకల్లోలం జరిగిందా? లేకపోతే లా అండ్ ఆర్డర్ ఏమైనా దెబ్బతిందా? అసలు ఏ సమస్యను చర్చించడానికి ఫోన్ ద్వారా జగన్ కు అపాయింట్ మెంట్ ఇచ్చారని గవర్నర్ ను ప్రశ్నించారు. దీనిపై స్పందించాలని తాను గవర్నర్ కార్యాలయాన్ని కోరుతున్నానన్నారు.
గవర్నర్ ను కలిసేందుకు వెళ్లినప్పుడు జగన్ తన ఎస్కార్టును తీసుకెళ్లలేదని, రోజూ వాడే వాహనంలో వెళ్లలేదని, సెక్యూరిటీ సిబ్బందినీ తీసుకెళ్లలేదని... ఒక స్నేహితుడి వాహనాన్ని తెప్పించుకుని, ఒంటరిగా గవర్నర్ ను కలిశారని అన్నారు. కారును కూడా దూరంగా ఆపి, నడచుకుంటూ వెళ్లి గవర్నర్ తో ఏం మాట్లాడొచ్చారు? అని జగన్ ను ఉద్దేశించి రామయ్య ప్రశ్నించారు.












Click it and Unblock the Notifications