వద్దని అరిచినా: అబిడ్స్‌లో బిల్డింగ్‌పైనుంచి దూకి యువతి ఆత్మహత్య, నీట్ అర్హత సాధించకపోవడమే..
Recommended Video

హైదరాబాద్: నగరంలోని అబిడ్స్ ప్రాంతంలో యువతి అనుమానాస్పద మృతితో కలకలం రేగింది. మంగళవారం ఉదయం మయూరి కాంప్లెక్స్ బిల్డింగ్ పైనుంచి కిందపడి ఓ యువతి మృతి చెందింది.
స్థానికులు అందించిన సమాచారంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. యువతి వివరాల కోసం పోలీసులు ఆరా తీస్తున్నారు. పదో అంతస్థు నుంచి కిందపడి ఆమె ప్రాణాలు వదిలినట్లు పోలీసులు అంచనా వేస్తున్నారు.

కాగా, సీసీ కెమెరా ఫుటేజీ పరిశీలిస్తే ఆ యువతి ఒక్కరే బిల్డింగ్‌పైకి ఎక్కి అక్కడ్నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలుస్తోంది. అయితే, ఆ యువతి ఎందుకు ఆత్మహత్యకు పాల్పడింది అనే విషయం తేలాల్సి ఉంది.
పలువురు ఆమెను గమనించి దూకొద్దని అరిచినప్పటికీ ఆమె దూకేయడం గమనార్హం. ఆ భవనంకు ఎదురుగా ఉన్న భవనం నుంచి ఎవరో ఒకరు ఆ యువతి ఆత్మహత్యకు సంబంధించిన వీడియోను తీశారు. ఆ వీడియో ఇప్పుడు వైరల్‌గా మారింది.
నీట్ అర్హత సాధించనందుకే..
మృతి చెందిన యువతి హైదరాబాద్‌లోని బర్కత్‌పురాకు చెందిన జస్లిన్ కౌర్(18) అని పోలీసులు గుర్తించారు. సోమవారం విడుదలైన నీట్ ఫలితాల్లో అర్హత సాధించకపోవడంతో మనస్తాపానికి గురైన ఆ అమ్మాయి ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలిపారు. యువతి మృతదేహాన్ని ఉస్మానియా ఆస్పత్రికి తరలించినట్లు తెలిపారు.












Click it and Unblock the Notifications