Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఆ ఇద్దరు మహిళా ఐఎఎస్ అధికారులు: జగన్ ఇచ్చిన టాస్క్- విశాఖ సమ్మిట్ గ్రాండ్ సక్సెస్ వెనుక

విశాఖపట్నంలో ప్రతిష్ఠాత్మక గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ 2023 తొలి రోజు విజయవంతంగా ముగిసింది. ఈ సమ్మిట్ సక్సెస్ కావడంలో ఇద్దరు మహిళా ఐఎఎస్ అధికారులు శ్రీలక్ష్మీ, గుమ్మళ్ల సృజన కీలక పాత్ర పోషించారు.

విశాఖపట్నం: సాగరనగరం విశాఖపట్నం వేదికగా.. ప్రతిష్ఠాత్మక గ్లోబల్ ఇన్వెస్టర్స్ సదస్సు కోలాహలంగా కొనసాగుతోంది. దేశీయ, విదేశీ పారిశ్రామిక దిగ్గజాలు ముఖేష్ అంబానీ, కరణ్ అదాని, జీఎంఆర్, సజ్జన్ భజాంక, పునీత్ దాల్మియా, అర్జున్ ఒబెరాయ్, నవీన్ జిందాల్, సజ్జన్ జిందాల్, కృష్ణా ఎల్లా, హరి మోహన్ బంగూర్, కియా ఇండియా చీఫ్ కబ్ డోంగ్ లీ పాల్గొన్నారు. తొలి రోజే 13 లక్షల కోట్ల రూపాయల విలువ చేసే పెట్టుబడులకు సంబంధించిన పరస్పర అవగాహన ఒప్పందాలను ప్రభుత్వంతో కుదుర్చుకున్నారు.

గ్రాండ్ సక్సెస్..

గ్రాండ్ సక్సెస్..

గ్లోబల్ ఇన్వెస్ట్‌మెంట్ సమ్మిట్ 2023 తొలి రోజు గ్రాండ్ సక్సెస్ అయింది. గ్రీన్ ఎనర్జీ సెగ్మెంట్ లో పెద్ద ఎత్తున పెట్టుబడులు రానున్నాయి. ఈ మేరకు ఆయా కంపెనీలు ప్రభుత్వంతో ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. ఆతిథ్య, పర్యాటక రంగంలోనూ భారీగా ఎంఓయూలు నమోదయ్యాయి. 8,718 కోట్ల రూపాయల మేర ఒప్పందాలను ఆయా రంగాలకు చెందిన పారిశ్రామికవేత్తలు- ఏపీ ప్రభుత్వంతో ఎంఓయూను కుదుర్చుకున్నారు.

వచ్చే అయిదేళ్లలో..

వచ్చే అయిదేళ్లలో..

రెండో రోజు కూడా భారీగా పరస్పర అవగాహన ఒప్పందాలు కుదిరే అవకాశం ఉంది. ఇవ్వాళ 13.50 లక్షల కోట్ల పెట్టుబడులకు ఎంఓయులు కుదిరాయి. రెండో రోజు మరో లక్షన్నర కోట్ల రూపాయల మేర అవగాహన ఒప్పందాలు కుదరనున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. దేశీయ పారిశ్రామిక దిగ్గజాలే స్వయంగా విశాఖపట్నానికి వచ్చారని, వారంతా స్వయంగా పెట్టుబడుల గురించి ప్రకటించడం వల్ల వచ్చే అయిదు సంవత్సరాల్లో అవన్నీ కార్యరూపం దాల్చుతాయని ప్రభుత్వం చెబుతోంది.

గ్రాండ్ సక్సెస్ వెనుక..

గ్రాండ్ సక్సెస్ వెనుక..

ఏపీ ఇన్వెస్టర్స్ సమ్మిట్ ఘన విజయం సాధించడం వెనుక.. ప్రధానంగా ఇద్దరు మహిళా ఐఎఎస్ అధికారులు శ్రీలక్ష్మీ, గుమ్మళ్ల సృజన కీలక పాత్ర పోషించారు. శ్రీలక్ష్మీ- మున్సిపల్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా పని చేస్తోన్నారు. గుమ్మళ్ల సృజన- పరిశ్రమల శాఖ డైరెక్టర్ గా ఉన్నారు. వీరిద్దరూ- సమన్వయంతో పని చేశారు. తమ తమ శాఖలను పరుగులు పెట్టించారు. తమ శాఖలపరంగా ఎలాంటి లోటు రాకుండా చూసుకోగలిగారు.

సభా ప్రాంగణం..

సభా ప్రాంగణం..

సభా ప్రాంగణం మొదలుకుని.. విశాఖపట్నంలో ఏర్పాట్లన్నింటినీ శ్రీలక్ష్మీ స్వయంగా పర్యవేక్షించారు. దీనికోసం ఆమె గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులతో సమీక్ష సమావేశాలను నిర్వహించారు. విశాఖ నగరాన్ని క్లీనెస్ట్ సిటీగా తీర్చిదిద్దగలిగారు. సభా ప్రాంగణానికి అవసరమైన మంచినీటి వసతి, విద్యుత్ సరఫరా, రోడ్ల నిర్మాణం.. ఇలా అన్ని రకాల మౌలిక సదుపాయాలను శ్రీలక్ష్మీ సకాలంలో అందించగలిగారు.

ఆహ్వానితుల కోసం..

ఆహ్వానితుల కోసం..

పరిశ్రమల శాఖ డైరెక్టర్ గుమ్మళ్ల సృజన- దేశీయ పారిశ్రామిక దిగ్గజాలను ఈ సమ్మిట్ కు స్వయంగా వెళ్లి ఆహ్వానించారు. తన శాఖ మంత్రి గుడివాడ అమర్ నాథ్ తో కలిసి ఆమె ముంబై వెళ్లారు. ముఖేష్ అంబానీ, ఆనంద్ మహీంద్ర, నటరాజన్ చంద్రశేఖరన్ లను స్వయంగా కలుసుకున్నారు. వారితో భేటీ అయ్యారు. ఏపీ గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ ప్రాముఖ్యతను వివరించారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి గల అవకాశాలపై పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు.

ఢిల్లీ సమ్మిట్ లోనూ..

ఢిల్లీ సమ్మిట్ లోనూ..

కిందటి నెల ఢిల్లీలో ఏర్పాటైన సమ్మిట్ ను కూడా విజయవంతం చేయడంలో గుమ్మళ్ల సృజన కీలక పాత్ర పోషించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్వయంగా ఈ ఢిల్లీ సమ్మిట్ కు హాజరైన విషయం తెలిసిందే. ఢిల్లీ, ముంబైల్లో నిర్వహించిన పారిశ్రామిక సమావేశాల్లో ఏపీ ప్రభుత్వానికి ఆమె ప్రాతినిథ్యాన్ని వహించారు. ఇదివరకు సృజన- గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ గా పని చేసిన అనుభవం కలిసొచ్చింది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+