విశాఖలో దారుణం: బాలికపై చర్చి పాస్టర్ అత్యాచారయత్నం - అరెస్ట్ - జగన్ సర్కారుపై లోకేశ్ ఫైర్
ఉత్తరప్రదేశ్ లోని హాత్రస్ లో 19ఏళ్ల యువతిపై హత్యాచారం ఘటనపై ఆందోళనలను తీవ్రతరం అవుతోన్నవేళ.. ఆంధ్రప్రదేశ్ లో కొత్త రాజధాని విశాఖపట్నంలో దారుణ సంఘటన చోటుచేసుకుంది. ఓ పాస్టర్.. తన చర్చికి వచ్చే మైనర్ బాలికపై అత్యాచారయత్నం చేయడం స్థానికంగా కలకలం రేపింది. బాధితురాలి తండ్రి ఫిర్యాదు మేరకు పాస్టర్ ను పోలీసులు అరెస్టు చేయగా, ఈ సంఘటనపై టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేశ్ కీలక వ్యాఖ్యలు చేశారు.

అసలేం జరిగిందంటే..
పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం.. విశాఖపట్నంలోని గాజువాకకు చెందిన ఓ వ్యక్తి.. చిన్నాచితకా పనులు చేసుకుంటూ, వాంబే కాలనీలోని సనత్ నగర్ లో తన ముగ్గురు పిల్లలతో కలిసి జీవిస్తున్నాడు. కొన్నేళ్ల కిందట భార్య చనిపోవడంతో పిల్లల ఆలనా పాలనా అతనే చూసుకుంటున్నాడు. కష్టాల్లో ఉన్న తమకు దేవుడు సాయం చేస్తాడనే నమ్మకంతో వీరంతా వాంబే కాలనీలోనే ఉన్న చర్చికి వెళ్లేవారు. కానీ ఆ చర్చి పాస్టరే తమ పాలిట సైతాను అవుతాడని వారు ఊహించలేకపోయారు. రెండ్రోజుల కిందట..

పెద్ద కూతురి కోసం వెళ్లగా..
తన ముగ్గురు పిల్లలు(ఇద్దరు అమ్మాయిలు, ఓ అబ్బాయి)ని వెంటపెట్టుకుని ఆ తండ్రి.. సోమవారం ఉదయం వాంబే కాలనీలో వున్న చర్చికి వెళ్లాడు. పాస్టర్ మునిబాబు అలియాస్ హెబెల్(32)తో కలిసి పశ్చిమ గోదావరి జిల్లా నిడదవోలు వెళ్లారు. అక్కడ ప్రార్థనలు ముగించుకుని, అదే రోజు రాత్రికి వాంబే కాలనీకి చేరుకుని, అంతా చర్చిలోనే నిద్రించారు. మంగళవారం ఉదయం ఇద్దరు పిల్లలను బైక్‌పై ఎక్కించుకుని వెళ్లిన తండ్రి.. పెద్ద కూతురు(16)ను నడుచుకుంటూ రమ్మని చెప్పాడు. కానీ ఆమె ఎంతకూ రాకపోవడంతో తిరిగి చర్చి వద్దకు వెళ్లగా దారుణం బయటపడింది..

పాస్టర్‌పై పోక్సో చట్టం కింద..
నడిచి రమ్మంటే ఇంకా ఇక్కడే ఎందుకున్నావని తండ్రి అడగడంతో ఆ కూతురు కన్నీటిపర్యంతమైంది. పాస్టర్ తనను వెనక్కు పిలిచి అత్యాచారయత్నానికి పాల్పడ్డాడని చెప్పింది. దీంతో ఆ తండ్రి గాజువాక పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితురాలు మైనర్ బాలిక కావడంతో పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసిన పోలీసులు పాస్టర్ హెబెల్‌ను అదుపులోకి తీసుకున్నారు. బాధితురాలిని వైద్య పరీక్షల కోసం కేజీహెచ్‌కు తరలించారు. ఈ ఘటనపై టీడీపీ నేత నారా లోకేశ్ తీవ్రస్థాయిలో స్పందించారు.
Recommended Video

అన్నగా ఉంటానన్న లోకేశ్..
మైనర్ బాలికపై చర్చి పాస్టర్ అత్యాచారయత్నం ఘటన.. రాష్ట్రంలో మహిళల పరిస్థితికి అద్దం పడుతున్నదని, బాధితురాలికి న్యాయం జరిగేదాకా టీడీపీ పోరాడుతుందని నారా లోకేశ్ చెప్పారు. ఈ మేరకు బుధవారం ఆయన ట్వీట్లు చేశారు. ‘‘విశాఖపట్నం, గాజువాక వాంబే కాలనీలో మైనర్ బాలికపై పాస్టర్ అత్యాచారయత్నం ఘటన రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాల తీవ్రతని తెలియజేస్తోంది. బాధిత బాలిక తండ్రి, మేనత్తతో ఫోన్లో మాట్లాడాను. బాలికకు అన్నగా అండగా ఉంటానని హామీ ఇచ్చాను. బాలికపై అత్యాచారానికి ప్రయత్నించిన వ్యక్తికి కఠిన శిక్ష పడేలా వారి కుటుంబం చేస్తున్న పోరాటానికి టీడీపీ అండగా ఉంటుంది'' అని లోకేశ్ భరోసా ఇచ్చారు.
-
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
today rashiphalalu: మీనరాశిని వదిలిపెట్టని ముఖ్యగ్రహాలు.. వీరి పంట పండుతుంది! -
హైదరాబాద్ జూపార్క్ లో వింత జంతువు.. భారీగా తరలివస్తున్న పర్యటకులు -
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
‘బాహుబలి2’, ‘పుష్ప2’లో నిజమైన ఇండస్ట్రీ హిట్ ఏది? -
కాచిగూడ మీదుగా తిరుపతికి వెళ్లే మరో ప్రత్యేక రైలు.. ఇకపై: ఏపీలో హాల్ట్ స్టేషన్లు -
అమెరికన్ కరెన్సీ ఇకపై.. !! -
సమ్మర్ స్పెషల్ 'పెసరపప్పు చారు'.. ఇదొక్కటి యాడ్ చేస్తే టేస్ట్ అద్దిరిపోద్ది..! -
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
రామ్‌చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
భారీగా బీర్ల ధరలు పెంపు, ఏ బ్రాండ్ ఎంత.!!












Click it and Unblock the Notifications