విశాఖపట్నం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

జ‌గ‌న్ తో అవంతి భేటీ..! : విశాఖ వైసిపి నేత‌ల‌కు పిలుపు: ఆ సీటు పైనే ష‌ర‌తు..!

|
Google Oneindia TeluguNews

టిడిపిలో మ‌రో వికెట్ ప‌డుతోంది. ఎంపీగా ఉన్న నేత పార్టీ మారేందుకు సిద్ద‌మ‌య్యారు. అన‌కాప‌ల్లి ఎంపి అవంతి శ్రీనివా స‌రావు ఈ రోజు జ‌గన్ ను క‌ల‌వ‌నున్నారు. అవంతి కి సీటు ఖ‌రారు హామీ నేప‌థ్యంలో విశాఖ జిల్లా వైసిపి నేత‌ల‌ను తన వ‌ద్ద కు రావాల‌ని జ‌గ‌న్ ఆహ్వానించారు. ఇప్ప‌టికే అవంతి తో పాటుగా విశాఖ వైసిపి నేత‌లు హైద‌రాబాద్ చేరారు.

వైసిపి లోకి అవంతి శ్రీనివాస్‌...

వైసిపి లోకి అవంతి శ్రీనివాస్‌...

ప్ర‌స్తుతం అన‌కాప‌ల్లి నుండి ఎంపీగా ఉన్న టిడిపి నేత అవంతి శ్రీనివాస రావు పార్టీని వీడ‌టం ఖాయ‌మైంది. ఈ రోజున ఆయ‌న లోట‌స్ పాండ్ లో జ‌గ‌న్ తో స‌మావేశం కానున్నారు. 2009 ఎన్నిక‌ల్లో ప్ర‌జారాజ్యం నుండి భీమిలిలో గెలిచిన ముత్తంశెట్టి శ్రీనివాస రావు 2014 లో ఎన్నిక‌ల స‌మ‌యంలో గంటా శ్రీనివాస‌రావుతో క‌లిసి టిడిపిలో చేరారు. అంతకు ముందు అవంతి గెలిచిన భీమిలి సీటులో 2014 ఎన్నిక‌ల్లో గంటా పోటీ చేసి గెలిచి మంత్రి అయ్యారు. 2019 ఎన్నిక‌ల్లో త‌న‌కు భీమిలి సీటు ఇవ్వాల‌ని అవంతి ప్ర‌తిపాదించినా..సానుకూల స్పంద‌న రాలేదు. దీంతో..ఆయ‌న వైసిపి లో చేరాల ని నిర్ణ‌యించారు. దీనికి సంబంధించి వైసిపి అధినాయ‌క‌త్వంతో ప్రాధ‌మికంగా చ‌ర్చ‌లు జ‌రిపారు. ఇక‌, గురువారం ఆయ‌న టిడిపి కి రాజీనామా చేసి వైసిపి అధినేత జ‌గ‌న్ ను క‌ల‌వ‌నున్నారు.

విశాఖ వైసిపి నేత‌ల‌కు జ‌గ‌న్ పిలుపు..

విశాఖ వైసిపి నేత‌ల‌కు జ‌గ‌న్ పిలుపు..

టిడిపి ఎంపి ముత్తంశెట్టి శ్రీనివాస రావు ఇప్ప‌టికే హైద‌రాబాద్ చేరుకున్నారు. ఆయ‌న చికిత్స కోసం ప్ర‌స్తుతం హైద‌రా బాద్ లో ఉన్న‌ట్లుగా చెబుతున్నారు. అవంతి త‌న‌కు భీమిలి సీటు ఇవ్వాల‌ని కోరుతుండ‌టంతో..విశాఖ జిల్లా వైసిపి నేత‌ల‌ను జ‌గ‌న్ త‌న వ‌ద్ద‌కు రావాల‌ని ఆదేశించారు. తొలుత వారితో చ‌ర్చించి.. ఆ త‌రువాత ఆమంచి తో జ‌గ‌న్ స‌మావే శంక కానున్నారు. భీమిలి నేత‌ల‌కు జ‌గ‌న్ న‌చ్చ చెప్ప‌నున్నారు. ఇప్ప‌టికే సీటు ఆశిస్తున్న స‌మ‌న్వ‌య‌క‌ర్త‌కు మ‌రో అవ కాశం ఇస్తాన‌ని బుజ్జిగించ‌నున్నారు. భీమిలి నియోజ‌క‌వ‌ర్గంలో అవంటి రావ‌టం వ‌ల‌ను ఆ నియోజ‌క‌వ‌ర్గంలోనే కాకుం డా విశాఖ ..అన‌కాప‌ల్లి లోక్‌స‌భ నియోజ‌క‌వ‌ర్గాల మీద ప్ర‌భావం ఉంటుంద‌ని వైసిపి నేత‌లు అంచ‌నా వేస్తున్నారు.

గంటా వ‌ర్సెస్ అవంతి

గంటా వ‌ర్సెస్ అవంతి

2009 నుండి ప్ర‌జారాజ్యం..ఆ త‌రువాత టిడిపి లో ఒకే గ్రూపుగా ఉన్న గంటా శ్రీనివాస రావు.అవంతి శ్రీనివాస రావు ఇప్పు డు రాజ‌కీయ ప్ర‌త్య‌ర్ధులుగా మార‌నున్నారు. 2019 ఎన్నిక‌ల్లో వైసిపి నుండి భీమిలి అభ్య‌ర్దిగా అవంతి శ్రీనివ‌స రావు బ‌రి లోకి దిగితే..టిడిపి నుండి గంటా శ్రీనివాస రావు పోటీ చేయ‌నున్నార‌. 2009 ఎన్నిక‌ల్లో ప్ర‌జారాజ్యం నుండి పోటీ చేసిన అవంతి శ్రీనివాస రావుకు 52,130 ఓట్లు రాగా, టిడిపి అభ్య‌ర్ది పై 6310 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. 2014 లో టిడిపి నుండి పోటీ చేసిన గంటా శ్రీనివాస రావు ఇక్క‌డ 37226 ఓట్ల మెజార్టీ సాధించారు. ఇక‌, వ‌చ్చే ఎన్నిక‌ల్లో వీరిద్ద‌రూ బ‌రిలో ఉండ‌టం..ఇక‌, జ‌న‌సేన ప్ర‌భావం సైతం ఇక్క‌డ బ‌లంగా ఉండ‌టంతో..త్రిముఖ పోటీలో గెలుపెవ‌రిదో చూడాలి.

English summary
TDP M.P Avanthi Srinivas ready join in YCP. Today he may met Jagan in otus pond. He demanding Bhimili assembly seat for coming elections. Jagan call Visakha ycp leaders to lotus pond.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X