కరోనా ఎంతపని చేసింది.. చికిత్స కోసం వస్తోండగా 12 మంది మావోల అరెస్ట్..

కరోనా వైరస్ సోకిన మావోయిస్టులు చికిత్స కోసం ఆసుపత్రికి వస్తున్నారు. అయితే తనిఖీ చేస్తోన్న పోలీసులు అడ్డంగా చిక్కారు. వరంగల్ జిల్లా మట్వాడా పోలీసులు ములుగు క్రాస్ రోడ్ వద్ద వాహనాలను తనిఖీలు చేస్తున్నారు. ఓ కారులో ఇద్దరు వ్యక్తులు అనుమానాస్పదంగా కనిపించడంతో వారిని ఆపి ప్రశ్నించారు. దీంతో వారు నిషేధిత సీపీఐ మావోయిస్టు పార్టీకి చెందిన దండకారణ్య స్పెషల్ జోన్ డివిజనల్ కమిటీ కార్యదర్శి గడ్డం మధుకర్, కొరియర్ బందుగ వినయ్‌గా పోలీసులు గుర్తించారు.

వారిని అదుపులోకి తీసుకోని విచారణ చేపట్టారు. మొత్తం 12 మంది కరోనా వైరస్ బారినపడినట్లు మావోయిస్టులు వెల్లడించారు. మావోయిస్టుల అరెస్టుకు సంబందించిన వివరాలను వరంగల్‌ నగర పోలీస్‌ కమిషనర్‌ తరుణ్‌ జోషి వెల్లడించారు. కరోనా సోకిన వారందరూ బయటకు వస్తే తాము మెరుగైన వైద్యం అందించేందుకు సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు. కరోనా బారినపడిన 12 మంది పేర్లను వెల్లడించారు కమిషనర్ తరుణ్ జోషి

police arrest maoists in warangal

బడే చొక్కారావు అలియాస్ దామోదర్, కటకం రాజిరెడ్డి అలియాస్ ధర్మన్న, కట్టా రాంచంద్రారెడ్డి అలియాస్ వికల్స్, కున్‌కటి వెంకటయ్య అలియాస్ వికాస్, ముచ్చకి ఉజల్ అలియాస్ రఘు, కటకం సుదర్శన్ అలియాస్ ఆనంద్, తిప్పరి తిరుతి అలియాస్ దేవుజీ, యాప నారాయణ అలియాస్ హరిభూషణ్, ములా దేవేంద్రరెడ్డి, అలియాస్ మాస దడ, కొడి మంజుల అలియాస్ నిర్మల, పూసం పద్మ, కాకర్ల సునీత అలియాస్ బుర్రా 12 మంది అని పోలీసులు తెలిపారు.

ఇటీవల చేపట్టిన నిరసన కార్యక్రమం వల్ల కరోనా సోకిందని పోలీసులు భావిస్తున్నారు. బీజాపూర్ సిల్దూర్ గ్రామం వద్ద కొత్తగా ఏర్పాటు చేస్తున్న పోలీసు క్యాంపును వ్యతిరేకిస్తూ ఛత్తీస్ ఘడ్.. తెలంగాణ సరిహద్దులోని ప్రజలతో నిరసన కార్యక్రమం నిర్వహించిన సంగతి తెలిసిందే. దీని ద్వారా మావోయిస్టులకు కరోనా సోకినట్లుగా భావిస్తున్నారు పోలీసులు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+