వరంగల్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కల్లు తాగిన మంత్రులు: కారుకూతలు వద్దు..? మంత్రి ఎర్రబెల్లి ఫైర్

|
Google Oneindia TeluguNews

కల్లు ప్రత్యేకతను పెద్దలు చెబుతుంటారు. తెలంగాణ మంత్రులు కూడా ముందుకొచ్చారు. శుక్రవారం శ్రీనివాస్ గౌడ్, ఎర్రబెల్లి దయాకరరావు జనగామ జిల్లా రామవరం గ్రామంలో పర్యటించారు. సర్దార్ సర్వాయి పాపన్న విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళుతున్న మార్గంలో గీత కార్మికులు ఉన్న మండవ వద్దకు వెళ్లి.. వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. తర్వాత తాటివనంలో గీత కార్మికుడు చెట్టు ఎక్కి కల్లు తీసుకువచ్చి ఇద్దరు మంత్రులకు ఇవ్వగా వారు తాటి కమ్మలో కల్లు పోసుకుని తాగారు.

ముందు శ్రీనివాస్‌గౌడ్‌ కల్లు తాగుతుండగా మొత్తం కల్లు తాగేస్తారని ఎర్రబెల్లి సెటైర్లు వేశారు. శ్రీనివాస్ గౌడ్ కూడా జోకులు వేస్తూ నవ్వులు పూయించారు. గీత కార్మికులు జై గౌడన్న.. జై జై గౌడన్న అంటూ నినాదాలు చేశారు. కల్లు ప్రత్యేకత చెప్పేందుకే కల్లు తాగామని మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. కూల్ డ్రింక్స్ కంటే కల్లు శ్రేష్టమైందని..దీనిపై చిల్లర కామెంట్స్ చేయొద్దని సూచించారు.

telangana ministers drinks kallu

పీఆర్సీ నివేదిక అశాస్త్రీయంగా ఉందని.. దానిని తాముకూడా ఒప్పుకోబోమని చెప్పారు. సీఎం కేసీఆర్ కు ఉద్యోగుల కష్టాలు తెలుసు అని.. దానిపై సరైన నిర్ణయం తీసుకుంటారని చెప్పారు. ప్రభుత్వాన్ని ఒప్పించి మెప్పించి పీఆర్సీ సాధించుకుందామని పేర్కొన్నారు 43 శాతం పీఆర్సీ ఇచ్చిన సమయంలో కొందరు తలలు బాదుకున్నారని.. ఇప్పుడు వాళ్లే పీఆర్సీ ఇవ్వట్లేదని మొత్తుకుంటున్నారని గుర్తుచేశారు.

telangana ministers drinks kallu

స్వ రాష్ట్రంలో ఉద్యోగుల ఎవరూ సరిగా పనిచేయడం లేదని ప్రచారం చేస్తున్నారని గుర్తుచేశారు. ఉద్యోగులు పనిచేస్తున్నారు కాబట్టే తెలంగాణలో అభివృద్ధి జరుగుతోందని వివరించారు. పీఆర్సీ విషయంలో ఉద్యోగులకు అన్యాయం జరగదన్నారు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు చెప్పారు. సీఎం కేసీఆర్ మనుసున్న మారాజని.. ఉద్యోగుల పీఆర్సీ విషయంపై కేటీఆర్, కేసీఆర్ దృష్టికి తీసుకెళ్తామని వెల్లడించారు.

English summary
telangana ministers errabelli dayakar rao and srinivas goud drinks kallu in janagama district.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X