తెలంగాణ ఎన్నారైల సమావేశం

ఉప ఎన్నికల ఫలితాలపై కూడా చర్చ జరిగింది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సంబంధించిన ప్రజల ఆకాంక్షను ఈ ఎన్నికలు ప్రతిబింబించలేదని, కొంత మంది శాసనసభ్యుల పట్ల ఉన్న అసంతృప్తి ఈ ఎన్నికల్లో వ్యక్తమైందని వేణుగోపాల్ అన్నారు. ప్రజల్లో తెలంగాణ చైతన్యం పెరుగుతోందని ఆయన అభిప్రాయపడ్డారు. తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) తన విధానాలను మార్చుకుని 2009 ఎన్నికలకు సిద్ధం కావాలని కొంత మంది అభిప్రాయపడ్డారు. తెలంగాణ చరిత్ర, సంస్కృతి, అస్తిత్వాలకు సంబంధించి జరుగుతున్న రాజకీయేతర ఉద్యమాల గురించి ఆయన వివరించారు. చివరగా రవి మేరెడ్డి కృతజ్ఞతలు తెలియజేశారు.












Click it and Unblock the Notifications