Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

నార్త్ అమెరికా తెలుగు సొసైటీ సంబరాలు

NRI
న్యూజెర్సీ: నార్త్‌ అమెరికా తెలుగు సొసైటీ (నాట్స్‌) తదుపరి ద్వైవార్షిక సంబరాలకు వేదికను ఖరారు చేసింది. న్యూజెర్సీలోని రాయల్‌ ఆల్బర్ట్‌ ప్యాలెస్‌లో 2011, నవంబర్‌ 1న అమెరికా తెలుగు సంబరాల పేరిట ఈ ద్వైవార్షిక సమావేశాలను నిర్వహించనున్నట్లు 'నాట్స్‌' ప్రకటించింది. ఈ ప్రకటన సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో నాట్స్‌ తరపున నిర్వహించే సామాజిక సేవా కార్యక్రమాలకు తోడ్పడవలసిందిగా పిలుపునివ్వగా దాతలు విశేషంగా స్పందించారు. మొత్తం 1200 మంది పాల్గొన్న ఈ కార్యక్రమంలో దాతలు 4లక్షల 87వేలు డాలర్లు (దాదాపు రూ.2 కోట్లు) నాట్స్‌ సేవా కార్యక్రమాల కోసం అందజేసారు. నితీష పలూరి "ఆ చందమామ నేనే" అనే గీతానికి లయబద్ధంగా, అద్భుతంగా నర్తించి ఆహూతులను మంత్రముగ్ధుల్ని చేసింది.

నాట్స్‌ కెరీర్‌ అసిస్టెంట్‌ డైరెక్టర్‌ అనిల్‌ బొప్పూడి వ్యాఖ్యాతగా వ్యవహరించిన ఈ కార్యక్రమంలో ముందుగా వరుణ్‌ వేముగంటి జాతీయ గీతాన్ని ఆలపించారు. అనంతరం యుగంధర్‌రావ్‌ వల్లభనేని, సత్యవతి వల్లభనేని, డాక్టర్‌ పూర్ణ అట్లూరి, డాక్టర్‌ శుభ అట్లూరి, నాట్స్‌ అధ్యక్షుడు డాక్టర్‌ రవి మాదాల, డాక్టర్‌ మధు కొర్రపాటి దీపప్రజల్వనం చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ప్రముఖ గాయకులు శ్రీనిధి, రఘురామ్‌ మధురమైన గీతాలపనలతో సాంస్కృతిక కార్యక్రమాలకు తెరతీసారు. వీరితో పాటు సింహ, రాజీవ్‌, అనిత కృష్ణ వైవిధ్య సంగీత సుస్వరాలలో ఓలలాడించగా, గజల్‌ శ్రీనివాస్‌ గజల్స్‌ ఆహూతులను కట్టిపడేసాయి. సింహాద్రి ఫేమ్‌ అంకిత చేసిన నృత్యప్రదర్శన కార్యక్రమానికి అదనపు ఆకర్షణ.

ఇంకా వెంట్రిలాక్విస్ట్‌ ప్రసాద్‌ సనాపతి ప్రదర్శన కూడా అందరినీ ఆకట్టుకున్నది. ఈ కార్యక్రమాలకు ఇటు నాట్స్‌ హెల్ప్‌లైన్‌ డైరెక్టర్‌ విజయ్‌రెడ్డి అన్నపురెడ్డి తద్వారా అందిస్తున్న సహాయాన్ని వివరించారు. అనంతరం రవి మాదాల నాట్స్‌ ద్వైవార్షిక సమావేశాల వేదికను ప్రకటించారు. అదేవిధంగా నాట్స్‌ చేపడుతున్న వివిధ సేవా కార్యక్రమాలను కూడా ఆయన వివరించారు. ఇంకా నాట్స్‌ రీజనల్‌ డైరెక్టర్‌ మోహన్‌కృష్ణ మన్నవ క్యాలెండర్‌ ఇయర్‌లో సంస్థ చేపట్టనున్న సేవా కార్యక్రమాల గురించి చెప్పారు. ఇటీవల రాష్ట్రంలో సంభవించిన వరదల్లో నాట్స్‌ చేపట్టిన సేవా కార్యక్రమాల గురించి శ్రీనివాస్‌ కోనేరు, శేఖరమ్‌ కొత్త వివరించారు.

ఈ కార్యక్రమంలో ప్రముఖ ప్రవాసాంధ్రులు వల్లభనేని యుగంధర్‌ రావు, మల్లారెడ్డి, డాక్టర్‌ మధు కొర్రపాటి, విజయ్‌రెడ్డి అన్నపురెడ్డి, హరనాథ్‌ దొడ్డపనేని, శైలజ అడ్లూరి, పూర్ణచంద్ర రెడ్డి, విక్రమ్‌ జంగమ్‌, బాపినీడు, బిక్కన మహేష్‌, జనని కృష్ణ, ప్రసాద్‌రావ్‌ నెప్పల్లి, దగ్గుబాటి శ్రీనివాస్‌ ప్రసాద్‌, డాక్టర్‌ అట్లూరి పూర్ణ, డాక్టర్‌ బాబూరావ్‌ దొడ్డపనేని, వెంకటేష్‌ ముత్యాల, శివ ముతికి, డాక్టర్‌ ప్రేమ్‌ నందివాడ, దాము గెదెల, నటరాజ్‌ గంధం, మహేష్‌ సలది, మూర్తి గులివెందుల, ధర్మరెడ్డి బొడ్డు, నాగేంద్ర గుప్త, దేషు గంగాధర్‌, ప్రసాద్‌ కనగల, మద్దాలి శ్రీనివాస్‌, పమిడిముక్కల మురళీకృష్ణ, రామ్‌ సూర్యదేవర, అంజు కొండబోలు, మోహన్‌రెడ్డి పటోల్ల, మహేందర్‌ రెడ్డి ముసుగు, రమేష్‌ ఏలూరు, రాజ్‌ అల్లాడ, జగదీశ్వర్‌ రెడ్డి, కరణి, సత్య నేమాని, జగన్‌ ఎర్రంరాజు, సుబ్బారెడ్డి జక్కంపూడి, సుబ్బా రాయుడు, నాగేందర్‌ మాధవరమ్‌, మురళి చింతపల్లి, శ్రీనివాస్‌ తునుగుంట్ల, ఇందుకూరి గణేష్‌ రాజు, ఈమని వెంకటరావు, కొడాలి శ్రీనివాస్‌, జోగేశ్వరరావు పెద్దిబోయిన,నాట్స్‌ కార్యదర్శి శ్రీనివాస్‌ కోనేరు, చంద్రశేఖర్‌ వోలేటి, శేఖరమ్‌ కొత్త, కోట ప్రసన్న, అడుసుమిల్లి రతీష్‌, విష్ణు వీరపనేని, శేషుబాబు వీరమాచినేని, గన్నె రమణ, రవి పొట్లూరి, అభిరుచి శ్రీనాథ్‌, కొత్తపాటి సాంబయ్య తదితరులు పాల్గొన్నారు.

ఈ కార్యక్రమ నిర్వహణ కోసం కృషి చేసిన మోహన్‌కృష్ణ మన్నవ, అనిల్‌ బొప్పూడి, రమేష్‌ గంధమనేని, ప్రసాద్‌ వడ్డెల, సుధీర్‌ తుమ్మల, వాసు తుపాకుల, రమేష్‌ నూతలపాటి, రవి పర్వతనేని, భాస్కర్‌ భూపతి, రమేష్‌ చంద్ర, రవి దన్నపునేని, ప్రదీప్‌ సువర్ణ, శ్రీనివాస్‌ గనగోని, మధు రెడ్డి, రాజ్‌ అల్లాడ, కృష్ణ తెల్ల, విష్ణు ఆలూరు, ప్రసాద్‌ గుర్రం, రమణ కోనేరు, ప్రసాద్‌ వేముగంటి, రంజిత్‌ చాగంటి, ప్రజ్వల తదితరులకు కృతజ్ఞతలు తెలిపిన అనంతరం పుణ్యభూమి నాదేశం అన్న దేశభక్తి గీతాలాపనతో కార్యక్రమం ముగిసింది. మోహన్‌ కృష్ణ మన్నవ వందన సమర్పణ చేశారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+