వాషింగ్టన్ డిసిలో బతుకమ్మ

ఈ సందర్భ్హంగా బతుకమ్మ పండుగ విశిష్టతను వివరిస్తూ ప్రపంచములో ఏప్రాంతంలో లేని విధంగా ప్రకృతితో మమేకమైన జీవన విధానాన్ని అవలంభిస్తూ, ఆరాధిస్తూ పునాస పంటల పిండి వంటలతో జరుపుకునే పండుగగా కోదండరాం అభివర్ణించారు. అలాగే నీటి వనరులు లేని తెలంగాణ ప్రాంత వ్యవసాయాన్ని గమనించిన కాకతీయ రాజులు తమ పరిపాలనా కాలంలో ప్రతి గ్రామానికి చెరువులను నిర్మించి వ్యవసాయ అభివృద్ధికి పాటు పడినట్లు తెలిపారు. ఈ క్రమంలో చెరువుల నిర్మాణంలో ఒక గ్రామ అడ పడచు చెరువు గండిని పూడ్చడము కొరకు చేసిన అత్మ త్యాగన్ని కీర్తిస్తూ జరుపుకునే పండుగ బతుకమ్మ పండుగ అని ప్రముఖ తెలంగాణ జానపదకవి డా. ఆందెశ్రీ వివరించారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన టిడిఎఫ్ - ఇండియా కన్వీనర్ శ్రీ దోమ పాండురంగారెడ్డి తన అనుభవాన్ని ప్రవాస తెలంగాణా వాసులతో పంచుకున్న తీరు ప్రత్యేక ఆకర్షణగా నిలచింది. ఆరు వందలకు పైగా తెలంగాణా ఆడపడచులు సాంప్రదాయక పట్టు చీరలను ధరించి మధ్యాహ్నం రెండు గంటలకు బతుకమ్మ ఆటను ప్రారంభించి సాయంత్రం ఆరు గంటలకు నిమజ్జనముతో తరువాత గౌరమ్మ పూజతో ముగించారు. ఇదే సందర్బంగా ప్రవాస పురోహితులు శ్రీ వెంకటాచార్యులు జమ్మి పూజను భక్తి శ్రద్దలతో జరిపించారు. వివిధ అటల పోటీలలో గెలిచిన చిన్నారులకు, బతుకమ్మ అలంకరణలో మొదటి మూడు బహుమతులను రాజెష్ బాదము ప్రొ. కోదండరాం అదించారు. కార్య నిర్వహక సభ్యులు రాజెష్ మాదిరెడ్డి, క్రిష్ణ దొమ్మాట, వేణు నక్షత్రం, శ్రీనివాస్ విప్పా, శ్యాం వీర్ల, విష్ణు మదావరం, రవి పల్లా, అమరేంద్రా రెడ్డి, సంతొష్ వేముల, అమర్ జనపురెడ్డి, రమణ కంచెటి, కల్యాణ్ ముద్దసాని, ప్రవీణ్ శ్యామల, ప్రదీప్ నూగూరు తదితరులు కార్యక్రమ్మాన్ని పర్యవేక్షంచారు. చివరగా రమాకాంత్ పీచార కార్య నిర్వాహక కమిటీ తరఫున ముఖ్య అథితులకు, అథితులకు కార్యక్రమానికి విరివిగ ఆర్థిక సహాయం చేసిన దాతలకు, మిర్చి రెస్టారెంట్, బంజార రెస్టారెంట్, టచ్ కుసినె, రజని వంటకాలకు చెందినవారికి పేరుపేరునా ధన్యవాదాలు తెలిపినారు.
శుక్రవారం రాత్రి టిడిఎఫ్ - యుఎస్ ఎ ఆధ్వర్యంలో స్థానిక మిర్చి రెస్టారెంట్లొ జరిగిన కార్యక్రమానికి ప్రొ. కోదండరాం ముఖ్య్త అతిథిగ విచ్చేసినారు. తెలంగాణ ఉద్యమం కీలక దశకు చేరుకున్నదని, రాబోయే రెండు మూడు నెలలలో తెలంగాణ వాదులంతా సంఘటితంగా ఉండి కేంద్ర ప్రభుత్వంపై పార్లమెంటులో బిల్లు పెట్టేటట్లు వత్తిడి పెంచాల్సి వుందని అన్నారు. ఈ ప్రక్రియలో ప్రవాస తెలంగాణా వాసులు తమ వంతు పాత్రను సమర్థవంతంగా పోషించాలని పిలుపునిచ్చారు. ఒక ప్రశ్నకు సమాధానంగా రాబోయె తెలంగాణ రాష్ట్ర్ర నిర్మాణంలో తమ పెట్టుబడులతో పాటు, తమ మేధో సంపత్తితో క్రియాశీలక పాత్ర నిర్వహించ వలసిందిగ పిలుపునిచ్చారు. ఈ సందర్బంగా ప్రవాస తెలంగాణ వాసులు అడిగిన వివిధ ప్రశ్నలకు ఓపికగ సమాధానాలు చెప్పినారు. ఈ కార్యక్రమానికి హాజరైన వారు ఇచ్చిన విరాళాలను రాజెష్ మాదిరెడ్డి ప్రొ. కొదండరాంకు అందజేస్తూ ఆ మొత్తాన్ని తెలంగాణ కళాకారుల ఐక్యవేదిక వరంగల్ వారు నిర్వహించే కార్యక్రమాలకు అదించవలసిందిగా కోరినారు.












Click it and Unblock the Notifications