ప్రవాస భారతీయుడికి గొప్ప పురస్కారం
వాషింగ్టన్: భారతీయ వైద్యులకు కూడా అమెరికాలో గుర్తింపు లభిస్తూనే ఉంది. భారత సంతతి వైద్య నిపుణుడు డాక్టర్ సంజయ్ గోయల్‌కు రూ.2.8 కోట్ల విలువైన పురస్కారం లభించింది. కోలోరెక్టల్ క్యాన్సర్‌లో రోగులకు తోడ్పడే విధానాలపై పరిశోధనలు నిర్వహించినందుకు ఈ బహుమతి వరించింది. మాంటెఫియోర్ మెడికల్ సెంటర్, ఆల్బర్ట్ ఐన్ స్టీన్ కాలేజ్ ఆఫ్ మెడిసిన్ లలో క్యాన్సర్ నిపుణుడిగా పనిచేస్తున్నారు. అమెరికన్ సొసైటీ ఆఫ్ క్లినికల్ ఆంకాలజీ వార్షిక సదస్సులో ఈ పురస్కారం అందుకున్నారు. గోయల్ వెల్లూరు క్రిస్టియన్ మెడికల్ కళాశాలలో వైద్యవిద్య అభ్యసించారు.













Click it and Unblock the Notifications