డ్యాన్స్‌పై అభిరుచి ఉన్న కళాకారులను ప్రోత్సహించేందుకు అమెరికాలోని వివిధ నగరాల్లో జోష్ ఎన్నారై హంట్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఇప్పటి వరకూ సుమారు రెండు వేల మంది ప్రిలిమ్స్ లో పాల్గొన్నారని, దీనిలో గెలుపొందిన వారు నవంబర్ లో జరిగే ఫైనల్స్ ల్లో తలపడతారని కార్యక్రమ మీడియా సమన్వయ కర్త మురళి మేడిచర్ల ఓ ప్రకటనలో తెలిపారు. చివరగా గెలుపొందిన విజేతలు ప్రముఖ నిర్మాత డాక్టర్ రామానాయుడు నిర్మించబోయే కొత్త చిత్రంలో నటించే అవకాశం లభిస్తుందన్నారు. ఇప్పటి వరకూ జరిగిన ప్రిలిమినరీ రౌండ్‌లో న్యూజెర్సీ నుంచి జూనియర్ కేటగిరిలో కె.చింతామణి, అరియకి దండవతే, ఏలూరి అక్షయ్, ప్రియ అరోహి దండవతే, మేడిచర్ల శైలజ, కల్లూరి సాయి సరోజ, ప్రిన్స్‌స్టన్ నగరం నుంచి సచిత్ ప్రత్యూష, ప్రియాంక, డల్లాస్ నుంచి మోనికా, హర్షిత్, మనోజ్ఞ, సింధూజ, భరత్, సుమన్, నరేష్, ప్రణొతిలు ఫైనల్స్‌కు అర్హత సాధించారని మురళి తెలిపారు. కూచిపూడి నృత్య కళాకారిణి పద్మజా రెడ్డి, వడ్లపట్ల రంజన్‌లు నిర్మాతలుగా వ్యవహరిస్తున్న జోష్ కార్యక్రమానికి శ్రీనివాస్, దాము గెదేల, మహేందర్‌లు సమన్వయ కర్తలుగా వ్యవహరిస్తున్నారన్నారు.