డల్లాస్ లో తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకలు

Telangana Liberation Day
డల్లాస్ ఎన్నారైలు తెలంగాణా విమోచన దినోత్సవం సందర్భంగా కోకిల రెస్టారెంట్ లో సెప్టెంబరు 17 రాత్రి నిర్వహించిన సభకు దాదాపు వంద మంది హాజరయ్యారు. నిర్వాహకులుముప్పిడి అరవింద్ రెడ్డి, సతీశ్ రెడ్డి, పజ్జూరు అనంత్ రెడ్డి, జువ్వాడి రమణ, అజయ్ రెడ్డిప్రాంతీయ, వర్గ భేదాలతో నిమిత్తం లేకుండా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. మల్లవరపుఅనంత్, మద్దుకూరి చంద్రహాస్, జువ్వాడి రమణల వందేమాతర గీతాలాపనతో కార్యక్రమం ప్రారంభం అయిన తరువాత సభకు అజయ్ రెడ్డి స్వాగతం పలికారు. తరువాత జువ్వాడి రమణ నిజాం ప్రభుత్వానికి వ్యతిరేకంగా తెలంగాణాలో జరిగిన స్వాతంత్ర్య పోరాట విశేషాలను వివరించారు.

త్రివర్ణ పతాకాన్ని ఎగరేసే భాగ్యం తెలంగాణా ప్రజలకి ఆగస్టు 15, 1947తరువాత పదమూడు నెలలకు గానీ కలగ లేదన్నారు. ఆ పైన కొండా శ్రీకాంత్ సర్దార్ పటేల్ ఔన్నత్యాన్నీ, ఆయన చేసిన దేశ సేవను సభికులకు వివరించారు.తదనంతరం కల్వల కరుణాకర్ రావు సర్దార్ పటేల్ నిజాం ప్రభుత్వం శాంతియుతంగా భారత దేశంలో విలీనం అయే ప్రయత్నాలు విఫలం అయిన తరువాతే భారత సైన్యాన్ని పంపవలిసి వచ్చిందని స్పష్టం చేశారు. తరవాత వయోవృద్ధులు తెలంగాణా స్వాతంత్ర్య పోరాటంలో ప్రముఖ పాత్ర వహించిన కొండా లక్ష్మణ్ బాపూజి గారు ఆ పోరాటంలో తమ అనుభవాలను సభికులతో టెలికాన్ఫరెన్స్ ద్వారా పంచుకున్నారు.

తరువాత సజీ గోపాల్ ఈ పోరాటంలో వివిధ సామాజిక వర్గాల పాత్ర గురించి మాట్లాడారు. తదనంతరం మల్లవరపు అనంత్, మద్దుకూరి చంద్రహాస్ బండెనక బండి గట్టి అనే పాట పాడారు. తరువాత చేకూరి కోటేశ్వర రావు మాట్లాడుతూ భూస్వాములకి వ్యతిరేకంగా పోరాడిన వారిలో అట్టడుగు వర్గాల నుండి అగ్ర వర్ణాల దాకా అందరూ ఉన్నారని గుర్తు చేశారు. తదనంతరం మాజీ ఆటా అధ్యక్షురాలు గవ్వ సంధ్య రజాకార్ల సమయంలో తమ కుటుంబం ఎదుర్కొన్న కష్టాల గురించి మాట్లాడారు. తరువాత కొర్సపాటి శ్రీధర్ మరియు చన్ద్ర కన్నెగన్టి నిర్వాహక వర్గాన్ని అభినందించారు. అరవింద్ రెడ్డి, సతీశ్ రెడ్డిల వందన సమర్పణతో కార్యక్రమం ముగిసింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+