జై జగన్: అమెరికాలో సంబరాలు

NRIs gathered to celebrate YSRCP victory
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులు డిట్రాయిట్ లో శుక్రవారం తెల్లవారుజామున ఉపఎన్నికల ఫలితాలు వెలువడిన వెంటనే సంబరాలు జరుపుకున్నారు. తమ పార్టీ ఘన విజయం సాధించిన సందర్భంగా పార్టీ ఆఫీసులో కేకు కట్ చేసి ఘనంగా వేడుక చేసుకున్నారు. ఉప ఎన్నికల్లో గెలుపొందిన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన 15 మందికి, ఎంపిగా రాజమోహన్ రెడ్డికి వారు అభినందనలు తెలియచేసారు.

ఉపఎన్నికల్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఘన విజయాన్ని అందించి పార్టీ అధినేత వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి నాయకత్వంపై ప్రజలు పూర్తి విశ్వాసాన్ని వ్యక్తపరిచారని వారు ఈ సందర్భంగా అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం, ఎల్లో మీడియా, తెలుగు దేశం పార్టీ, సిబిఐ అందరు కలిసికట్టుగా కుట్రలు పన్ని కక్షసాధింపుతో ఆయన్ని, ఆయన మద్దతుదారులను వేధించడాన్ని ప్రజలు సహించడం లేదనే విషయం తేటతెల్లంమైందని అభిప్రాయపడ్డారు.

ఎన్నారై వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు లింగాల హరిప్రసాద్ రెడ్డి, యుగంధర్ భుమిరెడ్డి, వెంకట్ బీరం, సునీల్ మండుటి, వినోద్ ఆత్మకూర్, పురశోతం కూకటి, టి శ్రీధర్, జగన్, దేవనాథ్ రెడ్డి, చిత్తలూరి శ్రీనివాస్, శ్రీనివాస్ పిడపర్తి, రమణ కొనుగంటి, శ్రీనివాస్ బర్ల, సాంబి రెడ్డి, బివి రెడ్డి, నరేష్ పూల, వేణు కాగితాల, కొండా రెడ్డి, ప్రదీప్, డాక్టర్ అశోక్ రెడ్డి తదితరులు ఈ సంబరాల్లో పాల్గొన్నారు.

వైయస్ జగన్ పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం, రాజ్యాంగ సంస్థలైన అసెంబ్లీ, ఎలక్షన్ కమిషన్, సీబీఐ, న్యాయ వ్యవస్థల పనితీరు, అవి తీసుకున్న నిర్ణయాలు, వ్యవహరించిన తీరు, కాంగ్రెస్, టీడీపీ విధానాల పట్ల ప్రజలు ఉప ఎన్నికల ఫలితాల ద్వారా చక్కగా స్పందించారని వారు వ్యాఖ్యానించారు. మన రాష్ట్రం ప్రస్తుతం వున్నదారుణమైన పరిస్థితి నుంచి తిరిగి ప్రగతి పథంలోకి తీసుకురాగల సత్తా వున్న నాయకుడు వైయస్ జగన్ మాత్రమేనని ప్రజలు బలంగా విశ్వసిస్తున్నారన్న విషయాన్ని ఇప్పటికైనా అన్ని పార్టీల నాయకులూ అర్థం చేసుకుని వైయస్ కాంగ్రెస్ పార్టీకి మద్దతు ప్రకటించాలని పిలుపునిచ్చారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+