లండన్‌లో సర్వమత ప్రార్థనలు

Sarvamatha Prarthana in lodon
తెలంగాణలో ఆత్మహత్యల నివారణకు ఎన్నారై తెరాస విభాగం యుకె సంస్థ లండన్‌లో సర్వమత ప్రార్థనలు నిర్వహించింది. పార్టీ 11వ వార్షికోత్సవం సందర్భంగా ఎన్నారై తెరాస విభాగం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమం తూర్పు లండన్‌లో కాపర్ ఫీల్డ్‌లో తెలంగాణ ప్రజలు హాజర్యయారు. తెలంగాణలో ఆత్మహత్యలు ఆగిపోవాలని, మతఘర్షణలు జరగకూడదని కోరుతూ వారు సర్వప్రార్థనలు చేశారు.

తెలంగాణ అమరవీరులకు సంతాపం వ్యక్తం చేస్తూ క్యాండిల్స్ వెలిగించి రెండు నిమిషాల పాటు మౌనం పాటించారు. భిన్న మతాలకు చెందినవారు ఆ తర్వాత ప్రార్థనలు చేశారు. ఆత్మహత్యలు ఆపి, మాట్లాడంటూ వారు నినాదాలు చేశారు. తెలంగాణ ఉద్యమాన్ని దశాబ్ద కాలం పాటు నిలకడగా, ప్రజాస్వామ్యబద్దంగా నడిపించిన తెరాస అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావును ఎన్నారై తెలంగాణ విభాగం అధ్యక్షుడు అనిల్ కూర్మాచలం అభినందించారు.ట

కెసిఆర్‌ను బలోపేతం చేస్తూ వస్తున్న పార్టీ కార్యకర్తలను ఆయన అభినందించారు. ఆత్మహత్యల వల్ల తెలంగాణ ప్రజలు క్షోభ చెందుతారని, ముఖ్యంగా కుటుంబ సభ్యులు తీవ్ర మనస్తాపానికి గురవుతారని అంటూ ఆత్మహత్యలు చేసుకోవద్దని ఆయన తెలంగాణ యువతను కోరారు. ఆత్మబలిదానాలు చేసుకోవడానికి బదులు తెలంగాణ ఉద్యమాన్ని బలోపేతం చేయడానికి ముందుకు రావాలని ఆయన కోరారు.

పరకాలలో తెరాస అభ్యర్థిని గెలిపించాలని ఆయన తెలంగాణ ప్రజలను కోరారు. చారిత్రాత్మక ఉద్యమంలో పాలుపంచుకునే అవకాశం కల్పించినందుకు ఆయన కెసిఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ఎన్నారై తెరాస విభాగం సభ్యులు రాజకుమార్ షానబోయిన, శ్రీకాంత్ పెద్దిరాజు, నాగేందర్ చిందం, రాజేష్, చందు, పోచారం సురేందర్ రెడ్డి, మహేష్, శశి, ప్రవీణ్, తులసీరాం, హరికృష్ణ, విష్ణు వేణుముద్దల, తదితరలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+