అమెరికాలో మృతి: మంత్రికి ఫ్యామిలీ విజ్ఞప్తి

వరంగల్ జిల్లా నందిగామ గ్రామానికి చెందిన క్రాంతి కుమార్ కుటుంబ సభ్యులు పొన్నాల లక్ష్మయ్యను కలిశారు. తన కారును పార్క్ చేయడానికి మంచును తొలగిస్తుండగా క్రాంతి కుమార్ ఛాతీలో నొప్పి వచ్చిందని, ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే మరణించాడని కుటుంబ సభ్యులు చెప్పారు.
తన భర్త మరణవార్త విన్న క్రాంతి కుమార్ భార్య వాణి దిగ్భ్రాంతికి గురైంది, ఆమెను న్యూయార్క్‌లోని ఆస్పత్రిలో చేర్చారు. మూడేళ్ల క్రితం వారి పెళ్లి జరిగింది. వాణి ఎనిమిది నెలల గర్భువతి.
ఉత్తర అమెరికా తెలుగు సంఘం (నాటా) ప్రతినిధులు క్రాంతి కుమార్ మృతదేహాన్ని ఇక్కడికి పంపించేందుకు ఏర్పాటు చేస్తున్నట్లు న్యూయార్క్‌లోని మృతుడి బంధువులు చెప్పినట్లు తెలుస్తోంది. క్రాంతి కుమార్ కుటుంబ సభ్యులు ఇతర పార్టీల నాయకులను కూడా కలిసి మృతదేహాన్ని ఇక్కడికి తరలించేందుకు సాయం చేయాలని కోరారు.












Click it and Unblock the Notifications