వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ముగ్గురి హత్య: ఎన్నారై టెక్కీకి కస్టడీ

By Pratap
|
Google Oneindia TeluguNews

 Triple murder accused NRI in judicial custody
హైదరాబాద్: ముగ్గురిని అమెరికాలో హత్య చేసిన కేసులో ఎన్నారై టెక్కీ నెరుసు లక్ష్మినివాస్ రావుకు ఢిల్లీ స్థానిక కోర్టు ఏప్రిల్ 18వ తేదీ వరకు జ్యుడిషియల్ కస్టడీ విధిస్తూ సోమవారం ఆదేశాలు జారీ చేసింది. అమెరికాలో భార్యాపిల్లలను హత్య చేసిన టెక్కీని సిఐడి పోలీసులు అరెస్టు ఇటీవల అరెస్టు చేశారు. నాలుగేళ్ల క్రితం భార్యాపిల్లలను హత్య చేసి పరారీలో ఉన్న 46 ఏళ్ల సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ లక్ష్మీనివాస రావును సిఐడి పోలీసులు అరెస్టు చేసి ఢిల్లీ కోర్టులో హాజరుపరిచారు.

ఎన్నారై లక్ష్మీనివాస రావు గత నాలుగేళ్లుగా పరారీలో ఉన్నాడు. అతను కృష్ణా జిల్లా ఉయ్యూరుకు చెందినవాడు. ఆంధ్రప్రదేశ్ కు చెందిన టెక్కీ లక్ష్మీనివాస రావు నెరసుపై అధికారులు నాలుగేళ్ల క్రితం అరెస్టు వారంట్ జారీ చేశారు. భార్యను, ఇద్దరు పిల్లలను చంపినందుకు గాను ఈ త్రీ కౌంట్ అరెస్టు వారంట్ జారీ అయింది. నిరుద్యోగి అయిన కంప్యూటర్ ప్రోగ్రామర్ ఆర్థిక బాధలను తట్టుకోలేక డెట్రాయిట్ లోని నోవీలో తన ఇంటిలో 2008 అక్టోబర్ 27వ తేదీన తన భార్య జయలక్ష్మిని, తన ఇద్దరు పిల్లలు తేజస్వీ (14), శివకుమార్ (12)లను హత్య చేసినట్లు పోలీసులు ఆరోపిస్తున్నారు.

వారి హత్య జరిగినప్పటి నుంచి లక్ష్మీ నివాసరావు కనిపించకుండా పోయాడు. హత్యను అడ్డుకోవడానికి వారు ప్రయత్నించినట్లు చేతులపై వారికి ఉన్న గాయాలు తెలియజేస్తున్నాయి. తలపై, మెడపై గాయాలతో ఆ ముగ్గురు తమ ఇంటిలోని రక్తమడుగులో శవాలై పడి ఉన్నారు. హత్య చేసిన అనంతరం లక్ష్మీనివాస రావు అమెరికా నుంచి పారిపోయినట్లు కేసు దర్యాప్తు అధికారులు అనుమానించారు.

లక్ష్మీనివాసరావు కోసం అంతర్జాతీయ స్థాయిలో వేట సాగించారు. నిరుద్యోగి అయిన కార్తిక్ రాజారాం అనే ఎన్నారై తన భార్యను, ముగ్గురు కుమారులను, అత్త హత్య చేసి తాను ఆత్మహత్య చేసుకుని మూడు వారాలు గడవక ముందే ఈ సంఘటన చోటు చేసుకుంది.

English summary

 Triple murder accused NRI Nerusu Lakshminivasa Rao was on Monday remanded in judicial custody till April 18 by a local court in Delhi.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X