లండన్‌లో తెరాస ఆవిర్భావోత్సవం

లండన్: తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) 13వ ఆవిర్భావ దినోత్సవం ఎన్నారై టిఆర్ఎస్ సెల్ ఆధ్వర్వంలో లండన్‌లో ఘనంగా జరిగాయి. సెల్ ప్రదాన కార్యదర్శి రాజ్ కుమార్ శానబోయిన, కోశాధికారి రాజేష్ కుమార్ స్వదేశం తిరిగి వెళ్తున్న సందర్భంగా వారిని ఘనంగా సన్మానించారు. ఎన్నారై తెరాస విభాగం లండన్ ఇంచార్జీ శ్రీకాంత్ పెద్ది రాజు ముందుగా అమర వీరులకు శ్రద్ధాంజలి ఘటించారు. సభ రెండు నిమిషాల పాటు మౌనం పాటించింది.

తెలంగాణ ప్రాంతానికి మైళ్ల దూరంలో ఉన్నా తెలంగాణ ఉద్యమంలో భాగస్వాములయ్యే అవకాశం కలిగించినందుకు తెరాస అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావుకు ఎన్నారై తెరాస విభాగం అధ్యక్షుడు అనిల్ కూర్మాచలం కృతజ్ఞతలు తెలిపారు. తెరాసతోనే తెలంగాణ రాష్ట్ర సాధన సాధ్యమని ఆయన అన్నారు. తెరాస చెస్తున్న పోరాటాన్ని ఆయన వివరించారు.

TRS foundation day in London

తెలంగాణలో సీమాంధ్ర నాయకత్వ పార్టీలను సమాధి చేయాల్సిన అవసరం ఉందని, అన్ని పార్టీల అసలు రంగులు బయటపడ్డాయని, తెలంగాణ ప్రజల వైపు ఉన్న పార్టీ ఏదనేది తేలియిందని, కాబట్టి రానున్న ఎన్నికల్లో తెరాసను అధిక మెజారిటీతో గెలిపించాలని ఆయన అన్నారు.

ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి యుకె నలమూలల నుంచి విచ్చేసిన తెరాస కార్యకర్తలకు, తెలంగాణవాదులకు, ముఖ్యంగా తెలెంగాణ ఎన్నారై ఫోరం ప్రతినిధులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. తర్వాత ప్రధాన కార్యదర్శి రాజ్ కుమార్ శానబోయిన మాట్లాడారు. ఇక ముందు క్షేత్రస్థాయిలో తెలంగాణ ఉద్యమంలో తన వంత పాత్రను నిర్వహిస్తానని, తెరాసను బలోపేతం చేయడానికి కెసిఆర్ నాయకత్వంలో ఓ కార్యకర్తగా పోరాటం చేస్తానని ఆయన చెప్పారు.

ఆ తర్వాత తెలంగాణ ఎన్నారై ఫోరం వ్యవస్థాపక సభ్యుడు గంప వేణుగోపాల్ మాట్లాడారు. ఎన్నారై తెరాస విభాగం నాయకులు అశోక్, హరి, మల్లారెడ్డి, చందు, అబుజర్ మొహమ్మద్, మహేష్, శ్రవణ్, వెంకటరెడ్డి, విక్రం, ప్రవీణ్, శశి, శ్రీకాంత్, కిరణ్, హరి ఉప్పలలతో, తెలంగాణ ఎన్నారై ఫోరం ప్రతినిధులు ఉదయ్ నాగరాజు, సుధాకర్, వంశీ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+