Australia: టెప్‍తో నోరు మూసి.. కేబుళ్లతో కట్టేసి.. సజీవంగా పాతిపెట్టాడు..

ఆస్ట్రేలియాలో భారతీయ విద్యార్థి దారుణ హత్యకు గురయింది. 21 ఏళ్ల భారతీయ విద్యార్థిని జాస్మీన్ కౌర్ హత్యకు సంబంధించిన కొత్త విషయాలు వెలుగులోకి వచ్చాయి. బాధితురాలిని ఆమె మాజీ ప్రియుడు తారిక్‌జోత్ సింగ్ కేబుల్ వైర్లతో బంధించి సజీవంగా పాతిపెట్టినట్లు నిర్ధారణ అయింది. పంజాబ్‌కు చెందిన జాస్మిన్ కౌర్ నర్సింగ్ చదువుకునేందుకు ఆస్ట్రేలియాకు వెళ్లింది.

ఆస్ట్రేలియాలో ఆమెకు తారిక్‌జోత్‌ సింగ్ తో అనే వ్యక్తితో ఏర్పడిన పరిచయం ఏర్పడింది. అది కాస్త ప్రేమగా మారింది. కొంతకాలం తర్వాత తారిక్‌ ప్రవర్తన విసిగిపోయిన ఆమె అతడిని దూరం పెట్టింది. దీంతో ఆమెను హత్య చేయాలని నిర్ణయించుకున్న తారిక్ జోత్ నార్త్ పాలింప్టన్ లో జాస్మిన్ కిడ్నాప్ చేశాడు. ఆమె కళ్లకు గంతలు కట్టి, కేబుళ్లు చుట్టి సజీవంగా పాతిపెట్టాడు. ఈ గఘటన 2021లో చోటుచేసుకుంది. దక్షిణ ఆస్ట్రేలియన్ సుప్రీం కోర్టులో ప్రాసిక్యూటర్ కార్మెన్ మాటియో SC జాస్మీన్ ఎలా చనిపోయిందో చెప్పారు.

indiannursingstudentmurderedbyboyfriendinaustralia

ఆమె అపహరణకు గురై, టేప్, కేబుల్ టైలతో బంధించబడి, కళ్లకు గంతలు కట్టి, స్పృహలో ఉండగానే సజీవంగా పాతిపెట్టాడని కోర్టుకు తెలిపారు. తారిక్ జోత్ సింగ్ జాస్మీన్ గొంతుపై కోసినప్పటికీ, ఆమె మరణానికి అవి కారణం కాదన్నారు. ఆమె మార్చి 6, 2021న మరణించినట్లు శవపరీక్ష నివేదిక వెల్లడించిందని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. నిందితుడు సింగ్ ఈ నేరానికి పక్కాగా ప్లాన్ చేసినట్టు తేలింది. సిసిటివి ఫుటేజీలో, అతను హత్య జరగడానికి గంటల ముందు, హార్డ్‌వేర్ స్టోర్ నుంచి గ్లౌజ్ లు, కేబుల్ టైలు, పార కొనుగోలు చేయడం కనిపించిందని చెప్పారు.

కోర్టు విచారణ సమయంలో, సింగ్ తరపున వాదించిన మార్టిన్ ఆండర్స్, తన క్లయింట్ కోపంలో అలా చేశాడని వాదించారు. జాస్మీన్ మరణం తర్వాత అతను వేదనకు గురయ్యాడని చెప్పాడు. అయితే, జస్టిస్ ఆడమ్ కింబర్ ఈ వాదనలను తోసిపుచ్చారు, జాస్మీన్‌ను తిరస్కరించినందుకు సింగ్‌ను శిక్షిస్తున్నట్లు పేర్కొన్నారు. తారిక్ జోత్ సింగ్ కు న్యాయమూర్తి జీవిత ఖైధు వించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+