కిడ్నాప్, రేప్: దోషిగా తేలిన సిక్కు డ్రైవర్

న్యూయార్క్: ప్రయాణికురాలి(29)ని కిడ్నా చేసి, ఆమెపై అత్యాచారానికి పాల్పడిన కేసులో భారతదేశానికి చెందిన ఓ సిక్కు టాక్సీ డ్రైవర్‌ను అమెరికా పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటన మూడేళ్ల క్రితం జరిగింది. కేసు విచారించిన స్థానిక కోర్టు మే 12న తీర్పు వెలువరించనుంది. ఆరోపణలు రుజువైతే నిందితుడు గుర్మీత్ సింగ్‌కు 25ఏళ్లపాటు జైలు శిక్ష విధించబడుతుంది.

2011, మే5న బాధిత మహిళ విలియమ్స్‌బర్గ్‌లో నిందితుడు గుర్మీత్ సింగ్(42)కి చెందిన టాక్సీలో ఎక్కింది. ఆమెను గమ్యస్థానానికి కాకుండా నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లిన గుర్మీత్ సింగ్ అక్కడే కారు నిలిపేశాడు. ప్రయాణికురాలి మెడపై కత్తి పెట్టి ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు.

New York Sikh cabbie found guilty of kidnapping, raping passenger

ఈ ఘటనలో కత్తి గీసుకోవడం వల్ల మహిళకు పలు చోట్ల గాయాలయ్యాయి. ఆమె పెదవులకు తీవ్ర గాయమైంది. ఆమెకు సంబంధించిన సెల్‌ఫోన్, 20 డాలర్లు పోయాయి. ఎలాగోలా తప్పించుకున్న బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది.

తనను హత్య చేస్తాడని తీవ్ర భయాందోళనకు గురైనట్లు బాధిత మహిళ పోలీసులకు తెలిపింది. నిందితుడ్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు కోర్టులో ప్రవేశపెట్టారు. ఆరోపణలు రుజువైతే నిందితుడు గుర్మీత్ సింగ్ కు 25ఏళ్ల జైలు శిక్ష విధించబడుతుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+