యూఎస్ జిఎస్‌గా భారతీయ అమెరికన్

జనరల్ సర్జన్ హోదా కోసం అనేక నామినేషన్లు వచ్చినప్పటికీ బరాక్ ఒబామా మాత్రం డాక్టర్ మూర్తిని జనరల్ సర్జన్‌గా నియమించనున్నట్లు గురువారం ప్రకటించారు. ఈ పదవిని చేపట్టేందుకు కావాల్సిన అన్ని అర్హతలు ఉన్నందువల్లే మూర్తికి ఈ హోదాను కల్పిస్తున్నట్లు ఒబామా తెలిపారు. నూతన హోదాలో అమెరికా ప్రజలకు వీరు తమ అద్భుతమైన సేవలను అందిస్తారనే నమ్మకముందని, రాబోయే కాలంలో వారితో పనిచేసేందుకు తాను సిద్ధంగా ఉన్నానని తెలిపారు. మూర్తి నియామకం పట్ల అమెరికాలోని భారతీయులు హర్షం వ్యక్తం చేశారు.
2011లో డాక్టర్ మూర్తి హెల్త్ ప్రమోషన్, సమీకృత ప్రజల ఆరోగ్యం, వ్యాధి నిరోధక సలహా బృందంలో సభ్యునిగా నియమించబడ్డారు. ఆ తర్వాత 2007లో ఏర్పాటైన ట్రయల్ నెట్‌వర్క్ బోర్డ్(ఎపర్నికస్)కు సహ స్థాపకుడిగా ఉన్న ఆయన ప్రస్తుతం ఆ బోర్డుకు ఛైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు. అంతేగాక 1995లో ఎయిడ్స్ అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో అమెరికాలో ఏర్పాటైన విజన్ వరల్డ్ వైడ్ అనే స్వచ్ఛంద సంస్థకు సహ వ్యవస్థాపకుడి ఉన్న ఆయన 1995-2000 వరకు ప్రెసిడెంట్‌గా, 2000-03 వరకు ఛైర్మన్‌గా వ్యవహరించారు.
డాక్టర్ మూర్తిని జనరల్ సర్జన్‌గా ప్రకటించిన నేపథ్యంలో ఇన్ఫ్లూయెన్షియల్ అమెరికన్ అసోసియేషన్ ఆఫ్ పిజిషియన్స్ ఆఫ్ ఇండియన్ ఓరిజిన్(ఏఏపిఐ) ప్రెసిడెంట్ డాక్టర్ జయేష్ బి షా హర్షం వ్యక్తం చేశారు. ఒబామాసరైన నిర్ణయం తీసుకున్నారని అన్నారు. ఇది అమెరికాలోని భారతీయ అమెరికన్ వైద్యులకు లభించిన గొప్ప గౌరవంగా భావిస్తున్నట్లు షా తెలిపారు. భారతీయ అమెకన్ వైద్యులకు ఈ హోదా సాధించడం ద్వారా మూర్తి మార్గదర్శకులుగా మారారని ఏఏపిఐ లెజిస్లేటివ్ కమిటీ ఛైర్మన్ హర్భజన్ అజ్రావత్,కో ఛైర్మన్ సంపత్ శివంగి పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications