NRI News: భువనేశ్వర్ లో ప్రవాసీ భారతీయ దివస్..

ఒడిశాలోని భువనేశ్వర్ లో ప్రవాసీ భారతీయ దివస్ (PBD) సదస్సు 18వ ఎడిషన్‌కు ఆతిథ్యం ఇవ్వనుంది. విదేశాల నుంచి ప్రముఖులు, వేలాది మంది ఎన్నారైలు ఈ సదస్సులో పాల్గొనున్నారు. గురువారం జనతా మైదాన్‌లో ప్రధాని నరేంద్ర మోదీ ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. ఈ కార్యక్రమానికి దాదాపు 5,000 మంది ఎన్నారైలు హాజరుకానున్నారు. ట్రినిడాడ్, టొబాగో ప్రెసిడెంట్ క్రిస్టీన్ కార్లా కంగాలూ ప్రారంభ కార్యక్రమంలో పాల్గొంటారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము జనవరి 10న వేడుకలకు హాజరుకానున్నట్లు అధికారులు తెలిపారు.

ఒడిశా తొలిసారిగా విదేశాంగ మంత్రిత్వ శాఖ నిర్వహించిన పీబీడీకి ఆతిథ్యం ఇస్తోంది. ఇందుకోసం భువనేశ్వర్ లో భారీ ఏర్పాట్లు చేశారు. రాజధాని నగరంలో స్వాగత తోరణాలు, హోర్డింగులు ఏర్పాటయ్యాయి. గోడలపై కళింగ వైభవానికి అద్దం పట్టే చిత్రాలను వేయించారు. ప్రవాసీ భారతీయ దివస్‌తో కొత్త బీజేపీ ప్రభుత్వం తన మొదటి అతిపెద్ద ప్రపంచ ఈవెంట్‌ను ఘనంగా నిర్వహించేలా ప్లాన్ చేస్తోంది.

Pravasi Bharatiya Divas to be held in Bhubaneswar

ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝీ, అతని బృందం అద్భుతమైన ఏర్పాట్లు చేస్తున్నారని దేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ చెప్పారు. భువనేశ్వర్‌లో ఇది చాలా విజయవంతమైన, గొప్ప ప్రవాసీ భారతీయ దివస్ అవుతుందని తాను భావిస్తున్నట్లుగా పేర్కొన్నారు. ఈ కార్యక్రమం బుధవారం నుంచి శుక్రవారం వరకు మూడు రోజులపాటు జరుగుతుంది. మెగా ఈవెంట్‌లో సాంప్రదాయ, ఆధునిక కళలతో నగర గోడలను తీర్చిదిద్దేందుకు 100 మందికి పైగా స్థానిక కళాకారులను నియమించారు. బుధవారం రాత్రి ప్రధాని నరేంద్ర మోదీ విశాఖపట్నం నుంచి భువనేశ్వర్‌ వెళ్తారు.

ఈ మెగా ఈవెంట్ కు పోలీసులు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేశారు. ఈ కార్యక్రమంతో ఒడిశాకు పెట్టుబడులు వచ్చే అవకాశం ఉందని అక్కడి బీజేపీ నేతలు భావిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+