అమెరికాలో నల్గొండ యువకుడి మృతి.. శోకసంద్రంలో పేరంట్స్
దేశం కానీ దేశంలో.. కొలువు కోసం/ ఉన్నత చదువు కోసం వెళ్లిన వారు ఉన్నత స్థితిలో ఉంటే ఓకే.. కానీ కొందరు యువకులు పిట్టల్లా రాలిపోతున్నారు. అవును విదేశాల్లో జరిగే ప్రమాదాల్లో ఆసువులు బాస్తున్నారు. తాజాగా అమెరికాలో తెలంగాణ యువకుడు మృతి చెందాడు. ఎల్లికాట్ సిటీలో ఈ నెల 19వ తేదీన జరిగిన రోడ్డు ప్రమాదంలో నల్గొండ జిల్లాకు చెందిన మండలి శేఖర్ చనిపోయాడు. శేఖర్ ఉద్యోగ నిమిత్తం రెండేళ్ల క్రితం అమెరికా వెళ్ళాడు. కుమారుడి మరణ వార్తను ఫోన్ ద్వారా తల్లిదండ్రులకు సమాచారం అందించారు.
శేఖర్ మరణవార్త తెలియడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. కష్టపడి చదివి మంచి ఉద్యోగం సాధించిన శేఖర్.. అకాల మరణం కుటుంబ సభ్యులను శోకసంద్రంలో ముంచింది. మృతదేహం స్వగ్రామానికి తీసుకువచ్చేందుకు తెలంగాణ ప్రభుత్వం చొరవ చూపాలని కుటుంబ సభ్యులు కోరుతున్నారు. శేఖర్ మృతిపై స్నేహితులు దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. అతనిని తాము మరచిపోలేమని అంటున్నారు. గ్రామంలో ఒక్కసారిగా విషాద ఛాయలు అలుముకున్నాయి. మిస్ యూ శేఖర్ అని అందరూ అంటున్నారు.

శేఖర్ స్వస్ధలం నల్గొండ జిల్లాలోని గుర్రంపోడు మండలం తెరాటి గూడెం. జాబ్ చేస్తూ మంచి పేరు తెచ్చుకున్నారు. వయసు తక్కువే కావడంతో.. పేరంట్స్ కూడా ఇబ్బంది పెట్టలేదు. లేదంటే పెళ్లి చేసుకోవాలని ప్రెషర్ చేసేవారు. శేఖర్ గత రెండు సంవత్సరాలుగా అమెరికాలో ఉద్యోగం చేస్తున్నాడు. మారుడి మృతదేహం భారత్ తీసుకువచ్చేందుకు సాయం చేయాలని అతడి తల్లిదండ్రులు ప్రభుత్వాన్ని అర్థిస్తున్నారు. ఇప్పటివరకు అయితే కేంద్ర/ రాష్ట్ర ప్రభుత్వాలు అయితే స్పందించలేదు.
చదువు పూర్తయి.. జాబ్ చేస్తోన్న సమయంలో ప్రమాదం కబలించింది. ప్రమాదం రూపంలో మృత్యు ఒడిలోకి శేఖర్ చేరాడు. తల్లిదండ్రులకు తీరని గుండెకోతను మిగిల్చాడు. తెరాటిగూడెం గ్రామంలో కూడా విషాద ఛాయలు అలుముకున్నాయి. తమ స్నేహితుడు ఒకరు.. చనిపోయారని యువత విలపిస్తోంది. శేఖర్ మరణం తీరని లోటు అంటోంది. అతని ఆత్మకు శాంతి చేకూరాలని హితులు, సన్నిహితులు కోరుకుంటున్నారు.












Click it and Unblock the Notifications