టిఏజిబి ఉగాది వేడుకలు: ఆటపాటల సందడి(పిక్చర్స్)
హైదరాబాద్: అమెరికాలోని ప్రవాసులు ఉగాది వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. బోస్టన్ పరిసర ప్రాంతాల తెలుగు సంఘం(టిఏజిబి) ఆధ్వర్యంలో శ్రీ మన్మధ నామ సంవత్సర ఉగాది వేడుకలు శనివారం(ఏప్రిల్ 18న)నాడు బుర్లింగ్టన్ హైస్కూల్ ఆడిటోరియం(బుర్లింగ్టన్ ఎంఏ)లో వైభయంగా జరిగాయి.
దాదాపు 1000 మందికి పైగా తెలుగు వారు ఈ వేడుకల లో పాల్గొన్నారు. సుమారు 200 మంది పిల్లలు, యువకులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. టిఏజిబి కార్యవర్గ సభ్యులు వేడుకలకు విచ్చేసిన వారందరికీ చక్కని ఉగాది పచ్చడి , పానకం అందించి స్వాగతం పలికారు. కార్యక్రమం కల్చరల్ సెక్రటరీ సత్యా పరకాల స్వాగత పలుకులతో ప్రారంభమైంది.
ఈ కార్యక్రమానికి వ్యాఖ్యాతలుగా వ్యవహరించిన దీప్తి, మాధవి తమదైన వాక్చాతుర్యంతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. చిన్నారులు ఆలపించిన శ్లోకాలు, భజన కీర్తనలతో ప్రారంభమైన కార్యక్రమం.. నృత్యాల సందడి తోపాటు, శాస్త్రీయ సంగీతం, శాస్త్రీయ నృత్య ప్రదర్సనలతో ముందుకు సాగింది. 7గంటలపాటు నిర్విరామంగా సాగిన కార్యక్రమంలో 50కిపైగా ప్రధానాంశాలతో కళాకారులు ప్రేక్షకులను ఉత్తేజ పరిచారు.
రమణా దుగ్గిరాజు, శ్రీకాంత్ గోమట్టం సాంప్రదాయ రీతిలో శ్రీ మన్మధనామ సంవత్సర రాశీ ఫలాలను చక్కగా వివరించారు. ఈ సందర్భంగా టిఏజిబి అధ్యక్షుడు శంకర్ మాగాపు తమ నూతన కార్యవర్గ సభ్యులను ప్రేక్షకులందరికీ పరిచయం చేశారు. బోర్డు అఫ్ ట్రస్టీ చైర్మన్ ప్రకాష్ రెడ్డి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేశారు.

ఉగాది వేడుకలు
అమెరికాలోని ప్రవాసులు ఉగాది వేడుకలను ఘనంగా జరుపుకున్నారు.

ఉగాది వేడుకలు
బోస్టన్ పరిసర ప్రాంతాల తెలుగు సంఘం(టిఏజిబి) ఆధ్వర్యంలో శ్రీ మన్మధ నామ సంవత్సర ఉగాది వేడుకలు శనివారం(ఏప్రిల్ 18న)నాడు బుర్లింగ్టన్ హైస్కూల్ ఆడిటోరియం(బుర్లింగ్టన్ ఎంఏ)లో వైభయంగా జరిగాయి.

ఉగాది వేడుకలు
దాదాపు 1000 మందికి పైగా తెలుగు వారు ఈ వేడుకలలో పాల్గొన్నారు. సుమారు 200 మంది పిల్లలు, యువకులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి.

ఉగాది వేడుకలు
టిఏజిబి కార్యవర్గ సభ్యులు వేడుకలకు విచ్చేసిన వారందరికీ చక్కని ఉగాది పచ్చడి , పానకం అందించి స్వాగతం పలికారు. కార్యక్రమం కల్చరల్ సెక్రటరీ సత్యా పరకాల స్వాగత పలుకులతో ప్రారంభమైంది.

ఉగాది వేడుకలు
ఈ కార్యక్రమానికి వ్యాఖ్యాతలుగా వ్యవహరించిన దీప్తి, మాధవి తమదైన వాక్చాతుర్యంతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.

ఉగాది వేడుకలు
చిన్నారులు ఆలపించిన శ్లోకాలు, భజన కీర్తనలతో ప్రారంభమైన కార్యక్రమం.. నృత్యాల సందడి తోపాటు, శాస్త్రీయ సంగీతం, శాస్త్రీయ నృత్య ప్రదర్సనలతో ముందుకు సాగింది.

ఉగాది వేడుకలు
7గంటలపాటు నిర్విరామంగా సాగిన కార్యక్రమంలో 50కిపైగా ప్రధానాంశాలతో కళాకారులు ప్రేక్షకులను ఉత్తేజ పరిచారు.

ఉగాది వేడుకలు
రమణా దుగ్గిరాజు, శ్రీకాంత్ గోమట్టం సాంప్రదాయ రీతిలో శ్రీ మన్మధనామ సంవత్సర రాశీ ఫలాలను చక్కగా వివరించారు.

ఉగాది వేడుకలు
ఈ సందర్భంగా టిఏజిబి అధ్యక్షుడు శంకర్మాగాపుతమ నూతన కార్యవర్గ సభ్యులను ప్రేక్షకులందరికీ పరిచయం చేశారు. బోర్డు అఫ్ ట్రస్టీ చైర్మన్ ప్రకాష్ రెడ్డి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేశారు.

ఉగాది వేడుకలు
టిఏజిబి కార్యనిర్వాహక కమిటీ, కార్యవర్గసభ్యులు, తానా ప్రెసిడెంట్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అందించిన ఉగాది పురస్కారం గ్రహీత, బోస్టన్ ప్రాంతాలలోని తెలుగు నాయకులైన మోహన్ నన్నపనేని సత్కరించారు.
టిఏజిబి కార్యనిర్వాహక కమిటీ, కార్యవర్గసభ్యులు, తానా ప్రెసిడెంట్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అందించిన ఉగాది పురస్కారం గ్రహీత, బోస్టన్ ప్రాంతాలలోని తెలుగు నాయకులైన మోహన్ నన్నపనేని సత్కరించారు. కేక్, డెకోరేషన్, పెయింటింగ్, తెలుగు క్విజ్ పోటీలు నిర్వహించి, విజేతలకు బహుమతులను అందజేశారు.
శనివారం సాయంత్రం కూచిపూడి నాట్యాలయవారు ప్రదర్శించిన ‘తెలుగు కళా వైభవము' నృత్య రూపకం ప్రతి ఒక్కరిని మంత్రముగ్ధులను చేసింది. ఈ ప్రదర్శనలో మన తెలుగు చరిత్రని, వైభవాన్ని, సంస్కృతిని కళ్ళకు కటినట్టుగా చూపించారు కళాకారులు. ఈ రూపకాన్ని ప్రదర్శించిన శైలజా తుమ్మల వారి శిష్యులను ప్రేక్షకులందరూ కరతాళ ధ్వనులతో కొనియాడారు.
సాంస్కృతికక ప్రదర్శనలతో పాటు ఆ ఆవరణలో పెట్టిన అంగడులు కూడా వచ్చిన వారిని ఆకట్టుకున్నాయి. వివధ రకాలైన ఆభరణములు, వస్త్రాల అంగడులు, సాంఘిక సేవాసంస్థలు, సైన్స్ సంబంధించిన వివరములు అందించే అంగడులతో ఆవరణమంతా జన సందోహముతో క్రిక్కిరిసిపోయింది.
కార్యక్రమానికి హాజరైన విజయవంతం చేసిన తెలుగు వారందరికీ, వాలంటీర్లకు, టిఏజిబి కార్యవర్గ సభ్యులకు, దాతలకు టిఏజిబి అధ్యక్షుడు శంకర్ మాగపు అభినందనలు తెలియజేశారు. టిఏజిబి సెక్రటరీ శ్రీనివాస్ బచ్చు వందన సమర్పణతో ముగిసింది.












Click it and Unblock the Notifications