టి, ఏపిల కోసం ‘తానా’ నిధుల సేకరణ

అమెరికాలోని ఎన్నారైలు అందించే విరాళాలపై పన్ను రాయితీ ఉంటుందని మోహన్ నన్నపనేని తెలిపారు. దాతలు ఒక్క రాష్ట్రానికైనా లేదా రెండు రాష్ట్రాలకైనా తమ విరాళాలను అందజేయవచ్చని తెలిపారు.
తాము సేకరించే విరాళాలను రెండు రాష్ట్రాల ప్రభుత్వాలకు అందజేస్తామని.. నిధులను సద్వినియోగం చేసుకోవాలని కోరనున్నట్లు ఆయన చెప్పారు.
తమ మాతృ భూమి అభివృద్ధికి తమ వంతుగా సహాయం అందించాలని అమెరికాలోని చాలా మంది తెలుగువారు ముందుకు వస్తున్నారని మోహన్ నన్నపనేని తెలిపారు. రెండు రాష్ట్రాల అభివృద్ధికి విరాళాలతోపాటు తమ ఆలోచనలను కూడా తెలియజేయాలని కోరారు. రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు తగిన విధంగా స్పందిస్తే.. రాష్ట్రాల అభివృద్ధి కోసం అమెరికాలోని తెలుగువారు మిలియన్ డాలర్లను అందించేందుకు సిద్ధంగా ఉన్నారని చెప్పారు.
డైరెక్టర్ ఆఫ్ తానా బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ జయరాం కోమటి, తానా సెక్రటరీ సతీష్ వేమన కొత్త రాష్ట్రాల ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వానికి సన్నిహితంగా వ్యవహరించి అవసరాలను తెలుసుకుంటారని చెప్పారు. విరాళాలు అందించాలనుకునేవారు తానా వెబ్‌సైట్ http://www.tana.org/donate సంప్రదించాలని కోరారు.












Click it and Unblock the Notifications