తెలుగు విద్యార్థి మృతి: అనుమానాలు

మీడియా కథనాల ప్రకారం - వాడ్యాల శ్రీధర్‌రెడ్డి, వాసుదేవి దంపతుల ఏకైక కుమారుడు అరవింద్‌రెడ్డి. మహబూబ్‌నగర్ పట్టణంలోని జయప్రకాష్‌నారాయణ్ ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్ పూర్తి చేసిన తర్వాత పై చదువుల కోసం మూడేళ్ల కిందట కాలిఫోర్నియాకు వెళ్లాడు. రెండేళ్ల పాటు అనుమతిలేని కళాశాలలో చదివి నష్టపోయాడు.
ప్రస్తుతం ప్రిమెట్‌లోని వార్డ్ వెస్ట్రన్ పాలిటెక్నిక్ యూనివర్శిటీలో ఎంఎస్ కంప్యూటర్ సైన్స్ చదువుతున్నాడు. బుధవారం మధ్యాహ్నం తండ్రి శ్రీధర్‌రెడ్డితో ఫోన్‌లో మాట్లాడ్డాడు. కాలిఫోర్నియాలోని ఓ హోటల్‌లో తోటి మిత్రులు పార్టీ చేసుకుంటూ అరవింద్‌రెడ్డిని కూడా ఆహ్వానించారు. పార్టీలో పాల్గొన్న అతను అనుమానాస్పద స్థితిలో అదే గదిలో మృతి చెందాడు.
విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. భారత రాయబార కార్యాలయం అధికారులు జోక్యం చేసుకుని అరవింద్‌రెడ్డి మృతిపై సమగ్ర విచారణ జరిపించి, నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు.












Click it and Unblock the Notifications