World Kidney Day:పేదలకు ఉచిత కిడ్నీ ఆరోగ్య పరీక్షలు నిర్వహించిన అపోలో డయాలసిస్ క్లినిక్స్

ప్రపంచ కిడ్నీ దినోత్సవాన్ని పురస్కరించుకుని,అపోలో డయాలసిస్ క్లినిక్స్ సికింద్రాబాద్‌లోని బన్సీలాల్‌పేట వికలాంగుల సేవా సంస్థ లో ప్రత్యేక సేవా కార్యక్రమం నిర్వహించింది. ఈ కార్యక్రమంలో పేద మరియు అవసరమైన వారికి ఉచిత యూరియా,క్రియాటినిన్ పరీక్షలు అందించడంతో పాటు పోషకాహార భోజనం పంపిణీ చేయబడింది.

ఈ కార్యక్రమంలో అపోలో డయాలసిస్ క్లినిక్స్ వైద్య నిపుణులు మరియు స్వచ్ఛంద సేవకులు పాల్గొని,మూత్రపిండ ఆరోగ్యం,దీర్ఘకాలిక కిడ్నీ వ్యాధి (CKD)ప్రమాదాలు,ఆరోగ్యకరమైన జీవనశైలి మార్పుల గురించి అవగాహన కల్పించారు.

Apollo Dialysis Clinics conducts a free health camp on World Kidney Day at secunderabad

ఈ సందర్భంగా అపోలో డయాలసిస్ క్లినిక్స్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ సుధాకర రావు మాట్లాడుతూ,"అందరికీ నాణ్యమైన ఆరోగ్య సేవలను అందించేందుకు తామెప్పుడూ ముందుంటామని అన్నారు. పేద ప్రజలకు అవసరమైన మూత్రపిండ ఆరోగ్య పరీక్షలు,పోషకాహారాన్ని తమ సేవా కార్యక్రమాల ద్వారా అందించేందుకు కట్టుబడి ఉన్నట్లు ఆయన వెల్లడించారు. ముందుగా కిడ్నీ వ్యాధిని గుర్తించడం చాలా అవసరమని చెప్పిన సుధాకర రావు...ఈ పరీక్షల ద్వారా, మూత్రపిండాల ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు ప్రజలకు అవగాహన కల్పించడమే తమ లక్ష్యమని తెలిపారు.

Apollo Dialysis Clinics conducts a free health camp on World Kidney Day at secunderabad

ఈ కార్యక్రమంలో 5,000కి పైగా ఉచిత మూత్రపిండాల పరీక్షలు నిర్వహించబడగా,ప్రజలు తమ ఆరోగ్య స్థితిని అర్థం చేసుకుని, అవసరమైనప్పుడు తప్పనిసరిగా వైద్య సలహా పొందాలనే విషయాన్ని గుర్తించారు.అపోలో డయాలసిస్ క్లినిక్స్ దేశవ్యాప్తంగా నాణ్యమైన డయాలసిస్ చికిత్సతో పాటు మూత్రపిండ ఆరోగ్యంపై అవగాహన కల్పించేందుకు నిరంతరం కృషి చేస్తోంది. భవిష్యత్తులో కూడా ఇలాంటి సేవా కార్యక్రమాలు నిర్వహించి, సమాజ ఆరోగ్యాన్ని మెరుగుపరిచేందుకు తమ కృషి కొనసాగుతుందని సుధాకర రావు తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+