జోష్-మాష్ యోగా దినోత్సవ క్యాంపెయిన్‌లో స్వామి అవదేశానంద్‌జీ భాగస్వామ్యం
న్యూఢిల్లీ: 8వ ఐక్యరాజ్యసమితి అంతర్జాతీయ యోగా దినోత్సవం 2022ను ఘనంగా నిర్వహించేందుకు అతిపెద్ద షార్ట్ వీడియో యాప్ జోష్ మరియు మాష్ ప్రాజెక్ట్ ఫౌండేషన్‌తో స్వామి అవదేశానంద్‌జీ జతకట్టారు. భారత యువతకు యోగా యొక్క ప్రాముఖ్యత వివరించేందుకు, అదే సమయంలో అవగాహన తీసుకొచ్చేందుకు స్వామి అవదేశానంద్‌జీ మరియు ఐఐటీ ఢిల్లీ పూర్వ విద్యార్థి అయిన అభినవ్ టాండన్‌లు #YogaForHumanity పేరుతో క్యాంపెయిన్ రన్ చేస్తున్నారు.
అంతర్జాతీయ యోగా దినోత్సవం ఏటా జూన్ 21వ తేదీన జరుపుకోవడం జరుగుతుంది. 2015 నుంచి ఈ కార్యక్రమం ఒక వేడుకలా జరుగుతోంది.2014 ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశంలో ప్రసంగించిన ప్రధాని మోదీ యోగా యొక్క ప్రాముఖ్యతను వివరించారు.ప్రతి సంవత్సరం అత్యంత పొడువైన రోజుగా చెప్పుకునే జూన్ 21వ తేదీన అంతర్జాతీయ యోగా దినోత్సవంగా ప్రకటించాలని ప్రధాని మోదీ ఐక్యరాజ్యసమితిని కోరారు. ఇక ఈ కార్యక్రమంను మరింతను విస్తరింపజేసి మరింత అవగాహన కల్పించేందుకు స్వామి అవదేశానందజీ #YogaForHumanity క్యాంపెయిన్‌ను ప్రారంభించారు. జూన్ 7వ తేదీ నుంచి జూన్ 28వ తేదీ 2022 వరకు ఈ క్యాంపెయిన్ నిర్వహించడం జరుగుతుంది. ఈ క్యాంపెయిన్‌ను ప్రముఖ షార్ట్ వీడియో యాప్ జోష్ వేదికగా నిర్వహిస్తున్నారు. జోష్ యాప్‌కు 153 మిలియన్ మంది నెలవారీ యాక్టివ్ యూజర్లు ఉన్నారు.ఈ ఛాలెంజ్‌లో భాగంగా యూజర్లు తమకు ఇష్టమైన యోగాసనం వేసి అది వీడియోగా తీసి జోష్‌లో పోస్టు చేసి మరో ముగ్గురిని ఈ ఛాలెంజ్ స్వీకరించాల్సిందిగా నామినేట్ చేయాల్సి ఉంటుంది.ఆ ముగ్గురు మరో ముగ్గురిని నామినేట్ చేయాల్సి ఉంటుంది.ఇప్పటి వరకు ఈ ఛాలెంజ్‌కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. జూన్ 21నాటికి 650 మిలియన్ మందికి పైగా స్పందించారు.

ప్రతి భారతీయుడు ఆరోగ్యవంతమైన జీవితం గడపాలని ఇది యోగాసనాల ద్వారా సాధ్యపడుతుందని చెప్పడమే ఈ ఛాలెంజ్ యొక్క ముఖ్య ఉద్దేశం. ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణమే ధ్యేయంగా ఈ క్యాంపెయిన్ నిర్వహిస్తున్నారు. స్వామి అవదేశానంద గిరి జీ ఎన్నో అంతర్జాతీయ వేదికలపై ప్రసంగించారు. వాతావరణ మార్పు, యోగా, సోదరాభావం వంటి అంశాలపై ప్రసంగించారు. అతిపెద్ద మరియు అతి ప్రాచీనమైన సాధు సంస్థ అయిన జునా అఖారాకు ఆచార్య మహామడలేశ్వర్‌గా వ్యవహరిస్తున్నారు.ప్రపంచ మతాధిపతుల సమాఖ్యలో బోర్డు మెంబర్‌గా కూడా సేవలందిస్తున్నారు. ఐక్యరాజ్య సమితి మే 2019లో రెస్పాన్సిబుల్ లీడర్షిప్ సమ్మిట్‌లో స్వామి అవదేశానంద్ గిరిజీ ప్రసంగించారు. ఈ ఏడాది యోగా దినోత్సవం సందర్భంగా న్యూయార్క్ సిటీలోని టైమ్‌స్క్వేర్‌లో ఈ ఆధ్యాత్మిక గురువు పాల్గొంటారు. ఈ కార్యక్రమంలో దాదాపుగా వెయ్యికిపైగా యోగా అంటే ఇష్టమున్నవారు పాల్గొంటారు.
"స్వామీజీ ప్రపంచవ్యాప్తంగా మంచిని సామరస్యాన్ని మన వేదాలను విస్తరింపజేస్తున్నారు.#Yogaforhumanity క్యాంపెయిన్ కోసం తాను కదిలి రావడం ఎంతో ఆనందాన్నిచ్చింది. ఈ కార్యక్రమాన్ని శక్తివంతంగాను అదేసమయంలో సింపుల్‌గా ఉండేలా చూడాలన్నారు. ఈ క్యాంపెయిన్ 50 కోట్ల మందికి చేరుతుందని భావిస్తున్నాం.షార్ట్ వీడియోస్ యాప్ జోష్, మాష్ ప్రాజెక్ట్, ప్రైజ్ పార్ట్‌నర్ అగస్త, మరియు స్మార్ట్ వాచ్ తయారీ సంస్థ రాప్జ్ సంస్థలు కలిసి పనిచేస్తున్నాయి. వీరందరికి కృతజ్ఞతలు" అని వరల్డ్ ఈజ్ వన్ మెటావెర్స్ (WIOM)వ్యవస్థాపకులు టాండన్ చెప్పారు.
" రోజూ యోగా చేయడం ద్వారా ఆరోగ్యవంతంగాను ఫిట్‌నెస్‌తో ఉంటాం. ఇలా ఉండేందుకు యోగా కంటే మించినది మరేదీ లేదు.#Yogaforhumanity క్యాంపెయిన్ రన్ చేసేందుకు మాష్ ప్రాజెక్టు మరియు స్వామి అవదేశానంద్‌జీతో జతకట్టాం. ఈ క్యాంపెయిన్‌ను ముందుండి నడిపిస్తున్న స్వామీజీకి ప్రత్యేక కృతజ్ఞతలు.యూజర్ మా నుంచి ఏం కోరకుంటున్నారో అది ఇచ్చేందుకు జోష్ ఎప్పుడు సిద్ధంగా ఉంటుంది. ఇలాంటి క్యాంపెయిన్‌లా ద్వారా యూజర్లకు మరింత చేరువయ్యే అవకాశం వస్తుంది. ఈ క్యాంపెయిన్ ద్వారా యువతకు యోగా యొక్క ప్రాధాన్యతను వివరించాలని స్వామీజీ భావిస్తున్నారు. ద్వితీయ, తృతీయ,నాల్గవ శ్రేణి నగరాలకు యోగాను తీసుకెళ్లాలనే మంచి ఉద్దేశంతో జోష్‌లాంటి వేదికను ఎంపిక చేసుకున్నందుకు సంతోషంగా ఉంది" అని అన్నారు జోష్ క్రియేటర్ మరియు కంటెంట్ ఎకోసిస్టం హెడ్ సుందర్ వెంకట్రామన్.
మాష్ ప్రాజెక్ట్ గురించి...
మాష్ ప్రాజెక్ట్ అనేది సామాజిక బాధ్యతను గుర్తు చేసి మంచి సమాజ నిర్మాణం కోసం పాటుపడే సంస్థ.కొన్ని సంస్థలతో కలిసి పనిచేసి యువతను సాధికారితవైపు నడిపించడంలో విజయం సాధించిన సంస్థ. పౌరసమాజ సంస్థలు, కార్పొరేషన్లు, విధాన నిర్ణేతలను మీడియా సంస్థలను ఒకే వేదికపైకి తీసుకువచ్చి తద్వారా యువత మేల్కొనేలా కార్యక్రమాలు నిర్వహిస్తోంది మాష్ ప్రాజెక్ట్
జోష్ గురించి...
వర్స్ ఇన్నోవేషన్ సంస్థచే ఆగష్టు 2020లో జోష్ అనే మేడిన్ ఇండియా షార్ట్ వీడియో యాప్‌ను ప్రారంభించడం జరిగింది.ఇండియాలోని 1000 మంది టాప్ క్రియేటర్లు జోష్‌పై తమ టాలెంట్‌ను ప్రదర్శిస్తున్నారు.20వేల కమ్యూనిటీ క్రియేటర్లు, 10 అతిపెద్ద మ్యూజిక్ లేబుల్స్,15 మిలియన్‌కు పైగా యూజీసీ క్రియేటర్లు, ఎంటర్‌టెయిన్‌మెంట్ ఫార్మాట్స్‌తో జోష్ యాప్ దూసుకుపోతోంది.ఇక గూగుల్ ప్లే స్టోర్ పై స్థిరమైన షార్ట్ వీడియో యాప్‌గా మంచి రేటింగ్స్ సంపాదించింది.ప్రస్తుతం జోష్ షార్ట్ వీడియో యాప్ పై 153 మిలియన్ నెలవారీ యాక్టివ్ యూజర్లు ఉన్నారు.74 మిలియన్ మంది రోజువారీ యూజర్లు సగటున కనీసం 23 నిమిషాలు సమయం యాప్‌పై వెచ్చిస్తున్నారు.
-
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!! -
సమ్మర్ లో ఈ హిల్ స్టేషన్ కు వెళ్తే.. మళ్లీ తిరిగి రావాలనిపించదు..! -
US Blockade: అమెరికాకు బిగ్ షాక్..! తేలిపోయిన హార్ముజ్ దిగ్బంధం..! -
జగన్, షర్మిల సహా వారికి చంద్రబాబు లేఖ - కీలక విజ్ఞప్తి..!!












Click it and Unblock the Notifications