Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

అయ్యా స్వాములు- తెలిసి చేశారా తెలియక చేశారా ఇన్ని తప్పులు

టీ20 ప్రపంచ కప్ 2026లో భారత్ విజయాల పరంపరకు బ్రేక్ పడింది. ఆదివారం రాత్రి అహ్మదాబాద్‌ నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగిన సూపర్-8 మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా చేతిలో ఘోర పరాజయం పాలైంది. 76 పరుగుల తేడాతో ఓటమి టోర్నమెంట్ చరిత్రలో భారత్‌కు అతిపెద్ద పరాజయం రికార్డును నమోదు చేసింది. ఈ ఓటమి తర్వాత టీమిండియా సెమీ ఫైనల్స్ అవకాశాలు దాదాపుగా సన్నగిల్లాయి. దాదాపు ద్వారాలు మూసుకుపోయాయి.

మొదట బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 187 పరుగులు చేసింది. డేవిడ్ మిల్లర్ 35 బంతుల్లో 63 పరుగులు చేసి కీలక పాత్ర పోషించాడు. భారీ లక్ష్య ఛేదనలో టీమిండియా బ్యాటింగ్ ఆది నుంచీ తడబడింది. పూర్తి ఓవర్లు కూడా ఆడకుండా చేతులెత్తేసిందంటే సఫారీల బౌలింగ్ పదును ఏ స్థాయంలో ఉందో అర్థం చేసుకోవచ్చు. 18.5 ఓవర్లలో 111 పరుగులకే ఆలౌట్ అయ్యింది. ఈ ఓటమితో టీ20 ప్రపంచ కప్ 2026లో భారత్‌కు సెమీఫైనల్ చేరే మార్గం కఠినంగా మారింది.

3 Reasons for India suffered a crushing 76-run loss against South Africa in the 1st Super 8 match

ఈ అనూహ్య పరాజయానికి ప్రధానంగా మూడు కారణాలు ఉన్నట్లు క్రీడా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

1. టాప్ ఆర్డర్ వైఫల్యం..

టీ20 ప్రపంచ కప్ కు ముందు వరకు భారత టాప్ ఆర్డర్ అద్భుతమైన ఫామ్‌లో కొనసాగింది. చిన్న జట్లపై 300 పరుగులు కూడా చేయగలదని ప్రచారం జరిగింది. గ్రూప్ దశ నుంచీ టాప్ ఆర్డర్ బ్యాటర్లు పూర్తిగా నిరాశపరిచారు. సౌతాఫ్రికాపై 188 పరుగుల లక్ష్య ఛేదనలో పటిష్ఠమైన ఆరంభం అవసరం కాగా, మొదటి మూడు వికెట్లు కేవలం 26 పరుగులకే కోల్పోవడం చేధనను దెబ్బతీసింది.

ఓపెనర్ ఇషాన్ కిషన్ ఖాతా తెరవకుండానే వెనుదిరగగా, అభిషేక్ శర్మ 15 పరుగులు, తిలక్ వర్మ కేవలం ఒక పరుగు మాత్రమే చేసి పెవిలియన్‌కు చేరాడు. ఈ ముగ్గురి వైఫల్యం కారణంగా భారత జట్టు మొదటి నుంచీ ఒత్తిడిలోకి వెళ్లి, చివరివరకూ కోలుకోలేకపోయింది. ఇది మ్యాచ్ గమనాన్ని పూర్తిగా మార్చేసింది.

2. అక్షర్ పటేల్‌ను పక్కన పెట్టడం..

గత గ్రూప్ మ్యాచ్‌లో నెదర్లాండ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో వైస్ కెప్టెన్ అక్షర్ పటేల్‌కు విశ్రాంతినిచ్చి వాషింగ్టన్ సుందర్‌కు అవకాశం కల్పించారు. అప్పుడు ఆ మ్యాచ్ పెద్దగా ప్రాముఖ్యత లేనిది కావడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు భావించారు. సౌతాఫ్రికా జట్టులో పలువురు ఎడమచేతి వాటం బ్యాటర్లు ఉన్నందున, అక్షర్ కంటే సుందర్ మెరుగైన ఎంపిక అని జట్టు మేనేజ్‌మెంట్ భావించింది. ఈ వ్యూహం పూర్తిగా తప్పని తేలింది.

ఈ మ్యాచ్‌లో సుందర్ రెండు ఓవర్లు మాత్రమే బౌల్ చేసి 17 పరుగులు ఇచ్చి ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాడు. బ్యాటింగ్‌లో కూడా అతను 11 పరుగులకే పరిమితమయ్యాడు. బ్యాటింగ్‌లో సుందర్ కంటే అక్షర్ పటేల్ మరింత సమర్థుడు. ఈ కీలక మ్యాచ్‌లో అక్షర్ జట్టులో ఉంటే, ఫలితం వేరేలా ఉండేవి.

3. మూడు వికెట్లు తీసిన తర్వాత అతి జాగ్రత్త..

మ్యాచ్ ఆరంభంలో భారత బౌలర్లు సౌతాఫ్రికాకు మూడు భారీ షాక్‌లు ఇచ్చారు. నాలుగు ఓవర్లలో 20 పరుగులకే క్వింటన్ డికాక్, కేప్టెన్ ఎయిడెన్ మార్క్రమ్, ర్యాన్ రికెల్టన్ పెవిలియన్‌కు చేరారు. ఈ దశలో టీమిండియా దూకుడుగా వ్యవహరించి మిగిలిన వికెట్లను కూడా పడగొడుతుందని అంతా భావించారు. సూర్యకుమార్ యాదవ్ రక్షణాత్మక వైఖరిని అవలంబించినట్లు కనిపించింది. మొదటి మూడు వికెట్లలో రెండు తీసిన జస్‌ప్రీత్ బుమ్రాను బౌలింగ్ నుండి తప్పించి, వరుణ్ చక్రవర్తికి బౌలింగ్ ఇచ్చారు.

ఇది పెద్ద తప్పని రుజువైంది. ఆరంభంలో బుమ్రాను కొనసాగించి మరికొన్ని వికెట్లు తీసే అవకాశం భారత్‌కు ఉన్నా, దానిని సద్వినియోగం చేసుకోలేకపోయింది. ఆ తర్వాత డేవిడ్ మిల్లర్, డెవాల్డ్ బ్రెవిస్ కలిసి 97 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పి సౌతాఫ్రికాను తిరిగి మ్యాచ్‌లోకి తీసుకువచ్చారు. ఈ భాగస్వామ్యం సౌతాఫ్రికా భారీ స్కోరు చేయడానికి దోహదపడింది. అది భారత్ గెలవలేని స్థితికి దారితీసింది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+