icc world cup 2023: కివీస్ తో పోరులో భారత్ పై నాకౌట్ ఒత్తిడి ? డ్రెస్సింగ్ రూమ్ పరిస్దితిపై ద్రవిడ్
ఐసీసీ వన్డే వరల్డ్ కప్ లీగ్ దశ పూర్తయింది. నవంబర్ 15 నుంచి సెమీ ఫైనల్ మ్యాచ్ లు, అనంతరం ఫైనల్ ఉంటాయి. అయితే తొలి సెమీస్ లో న్యూజీలాండ్ తో పోరుకు సిద్ధమవుతున్న టీమిండియా తాజా పరిస్దితి ఎలా ఉందో తెలుసా ? ముఖ్యంగా టీమిండియా డ్రెస్సింగ్ రూమ్ సిట్యుయేషన్ ఎలా ఉందన్న దానిపై కోచ్ రాహుల్ ద్రవిడ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. కివీస్ తో సెమీస్ మ్యాచ్ కు టీమిండియా ఎలా సిద్ధమవుతోందన్న దానిపై రాహుల్ వ్యాఖ్యలు వాస్తవ పరిస్దితికి అద్దం పట్టేలా ఉన్నాయి.
నిన్న నెదర్లాండ్స్ పై భారీ విజయంతో ఈ వరల్డ్ కప్ లో తమకు తిరుగే లేదని నిరూపించుకున్న టీమిండియా.. ఇప్పుడు కివీస్ పై ఫోకస్ పెట్టింది. ఈ తరుణంలో కివీస్ సెమీ ఫైనల్ లో టీమిండియా ఒత్తిడి అధిగమిస్తుందా లేదా అన్న చర్చ మొదలైంది.
గ్రూప్ దశను అజేయంగా ముగించిన తర్వాత జట్టు కోచ్ రాహుల్ ద్రవిడ్ ను నాకౌట్ మ్యాచ్ గురించి అడిగితే ప్రస్తుతం తమ జట్టుకు ప్రపంచ కప్ సెమీ-ఫైనల్ ఒత్తిడిని నావిగేట్ చేయగల సామర్ధ్యం ఉందని విశ్వాసం వ్యక్తం చేశాడు.

ప్రస్తుతం భారత డ్రెస్సింగ్ రూమ్ పరిస్దితి మాత్రం సానుకూలంగా ఉందని, అయితే కివీస్ తో సెమీస్ ను మాత్రం మరో గేమ్ మాత్రమే అని చెప్పలేనని రాహుల్ ద్రవిడ్ వెల్లడించాడు. క్రికెట్ లో అలాంటి హామీలేవీ ఇవ్వలేమన్నాడు. నాకౌట్ గేమ్ కావడం వల్ల కచ్చితంగా తమపై ఒత్తిడి ఉంటుందని అందరూ అంగీకరించాల్సిందేనన్నాడు. అయితే తమ ప్రణాళికల్లో మాత్రం ఎలాంటి మార్పులు ఉండబోవన్నాడు.
తాము ఇప్పటివరకు ఒత్తిడికి స్పందించిన విధానం చాలా నమ్మకాన్ని, విశ్వాసాన్ని ఇస్తుందని రాహుల్ ద్రవిడ్ చెప్పాడు. మనం సిద్ధం చేసే విధానంలో లేదా శిక్షణ ఇచ్చే విధానంలో ఏదైనా మార్చగలమని తాను అనుకోనన్నాడు. ప్రస్తుతం టీమిండియాలో వైబ్స్ మాత్రం బాగున్నాయని, తమ వ్యూహాల్ని గ్రౌండ్ లో అమల్లో పెట్టడంలోనే అంతా ఉందన్నాడు. ద్రవిడ్ మాటలు చూస్తుంటే టీమిండియా ఆత్మవిశ్వాసం ఏ స్ధాయిలో ఉందో ఇట్టే అర్ధమవుతోందని పలువురు క్రికెట్ విశ్లేషకులు చెప్తున్నారు.












Click it and Unblock the Notifications