ఆ గంభీర్‌ను ప్రెస్ మీట్లకు పంపించకండ్రా సామి
IND vs AUS 2024: భారత జట్టు ఆస్ట్రేలియా పర్యటన ఆరంభమైంది. అయిదు టెస్ట్ మ్యాచ్‌ల బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ ఇది. స్వదేశంలో ఆస్ట్రేలియా జట్టును ఎదుర్కొనబోతోంది. మొత్తం అయిదు మ్యాచ్‌లతో కూడిన టెస్ట్ సిరీస్ ఇది. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లో భాగంగా ఈ సిరీస్ ఏర్పాటైంది.
ఇప్పటికే విరాట్ కోహ్లీ అక్కడికి చేరుకున్నాడు. జట్టు ప్లేయర్లతో కాకుండా విడిగా అతను ఆస్ట్రేలియాకు బయలుదేరి వెళ్లారు. మిగిలిన ప్లేయర్లతో కూడిన తొలి విడత బ్యాచ్ ఆస్ట్రేలియాకు బయలుదేరి వెళ్లింది. తొలి టెస్ట్ మ్యాచ్ ఈ నెల 22వ తేదీన జరుగుతుంది. దీనికి పెర్త్ ఆతిథ్యాన్ని ఇవ్వనుంది. భారత కాలమానం ప్రకారం.. మధ్యాహ్నం 2:20 నిమిషాలకు మ్యాచ్ ఆరంభమౌతుంది.

రెండో టెస్ట్- డిసెంబర్ 6వ తేదీన అడిలైడ్, మూడో మ్యాచ్- 14వ తేదీన బ్రిస్బేన్, 4వ మ్యాచ్- 26వ తేదీన మెల్‌బోర్న్‌లో షెడ్యూల్ అయ్యాయి. చివరి టెస్ట్ మ్యాచ్ వచ్చే ఏడాది జనవరి 3వ తేదీన ఉంటుంది. దీనికి సిడ్నీ వేదిక. ఈ సిరీస్‌ను ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది టీమిండియా. శుభారంభం చేయాలనే పట్టుదలతో ఉంది.
దీనికి అవసరమైన కసరత్తు చేస్తోంది. న్యూజిలాండ్ పర్యటనలో ఎదురైన చేదు అనుభవాన్ని అధిగమించి, ఈ సిరీస్‌ను సొంతం చేసుకోవడం, డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో మళ్లీ అగ్రస్థానాన్ని చేరుకోవాలని భావిస్తోంది. తొలి టెస్ట్‌కు కేప్టెన్ రోహిత్ శర్మ అందుబాటులో ఉండటంపై అనుమానాలు నెలకొన్నాయి. జట్టుతో పాటు అతను ఆస్ట్రేలియాకు వెళ్లట్లేదని తెలుస్తోంది.
ఈ టూర్‌ను దృష్టిలో ఉంచుకుని హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ఈ ఉదయం విలేకరులతో మాట్లాడిన విషయం తెలిసిందే. రోహిత్ శర్మ అందుబాటులో ఉండట్లేదనే విషయాన్ని సూచనప్రాయంగా వెల్లడించాడు. అతను అందుబాటులో లేకపోతే వికెట్ కీపర్ బ్యాటర్ కేఎల్ రాహుల్ లేదా పేస్ బౌలర్ జస్‌ప్రీత్ బుమ్రాలల్లో ఒకరికి కేప్టెన్సీ పగ్గాలను అందిస్తామని పేర్కొన్నాడు. పలు అంశాలపై అతను మాట్లాడాడు.
ఈ ప్రెస్ మీట్‌పై టీమిండియా మాజీ ఓపెనర్, కామెంటేటర్ సంజయ్ మంజ్రేకర్ అభ్యంతరం చెప్పాడు. అసహనం వ్యక్తం చేశాడు. గౌతమ్ గంభీర్ ప్రెస్ కాన్ఫరెన్స్ అసాంతం చూశానని అతన్ని ఇలాంటి కార్యక్రమాలకు పంపించకపోవడమే మంచిదని అభిప్రాయపడ్డాడు. దీన్ని బీసీసీఐ అధికారిక ఎక్స్ అకౌంట్‌కు ట్యాగ్ చేశాడు.
మీడియా ప్రతినిధులు అడిగే ప్రశ్నలకు అతని వద్ద సమాధానాలు ఉండట్లేదని చెప్పాడు. తెలివిగా మాట్లాడుతున్నానని గంభీర్ అనుకొని ఉండొచ్చని, వాస్తవ పరిస్థితులు దీనికి భిన్నంగా ఉన్నాయని సంజయ్ మంజ్రేకర్ పేర్కొన్నాడు. అతన్ని ఇలాంటి కార్యక్రమాల నుంచి దూరంగా ఉంచాలని బీసీసీఐకి సూచించాడు. గంభీర్‌కు బదులుగా జట్టు కేప్టెన్ రోహిత్ శర్మ లేదా చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్‌ను ప్రెస్ మీట్లకు సరిపోతారని అన్నాడు.












Click it and Unblock the Notifications