Paris Olympics 2024: పారిస్ ఒలింపిక్స్ లో బోణి కొట్టిన భారత్..
పారిస్ ఒలింపిక్స్ లో భారత్ బోణి కొట్టింది. ఈ ఒలింపిక్స్ లో భారత్ తరఫున మను బాకర్ తొలి పతకం సాధించింది. మను బాకర్ 10మీ ఎయిర్‌పిస్టల్‌లో కాంస్య పతకం గెలిచింది. ఒలింపిక్స్‌లో షూటింగ్‌లో పతకం సాధించిన తొలి భారత మహిళా షూటర్‌గా మను బాకర్ రికార్డ్ క్రియేట్ చేసింది. మను బాకర్ ఫైనల్‌లో 221.7 పాయింట్లతో మూడో స్థానంలో నిలిచి కాంస్య పతకం గెలిచింది. దక్షిణ కొరియా షూటర్ ఓహ్ యే జిన్ 243.2 పాయింట్లలో స్వర్ణం సాధించింది.
అదే దేశానికి చెందిన కిమ్ యేజే 241.3 పాయింట్లతో రజతం పతకం ఖాతాలో వేసుకున్నాడు. పురుషుల 10మీ ఎయిర్ పిస్టల్ క్వాలిఫికేషన్ రౌండ్‌లో అర్జున్ బబుతా మంచి ప్రదర్శన కనబరిచాడు. అర్జున్ 630.1 స్కోరుతో ఏడో స్థానంలో నిలిచి ఫైనల్‌కు అర్హత పొందాడు. ఇదే విభాగంలో మరో భారత షూటర్ సందీప్ సింగ్ ఫైనల్ క్వాలిఫై కాలేదు. పురుషుల 10మీ ఎయిర్ పిస్టల్ ఫైనల్ సోమవారం మధ్యాహ్నం 3.30 గంటలకు మొదలు కానుంది.

బ్యాట్మెంటన్ తొలి మ్యాచ్‌లో మాల్దీవులకు చెందిన క్రీడాకారిణి అబ్దుల్ రజాక్‌పై పీవీ సింధు విజయం సాధించింది.వరుస గేమ్‌ల్లో సింధు గెలిచి కేవలం 29 నిమిషాల్లోనే మ్యాచ్ ను ముగించింది. బుధవారం ఎస్తోనియా క్రీడాకారిణి క్రిస్టినా కూబాతో పీవీ సింధు పోటీ పడనుంది. రోయింగ్‌లోని రిపెఛేజ్ విభాగంలో భారత అథ్లెట్ బాల్‌రాజ్ పన్వార్ క్వార్టర్‌ఫైనల్స్‌కు చేరాడు. రెండో రౌండ్‌లో అద్భుత ప్రదర్శనతో రెండో స్థానంతో బాల్‌రాజ్ క్వార్టర్స్‌లో అడుగు పెట్టాడు.
మహిళల 10 మీటర్ల రైఫిల్ షూటింగ్ విభాగంలో భారత క్రీడాకారిణి రమిత ఫైనల్‌కు వెళ్లింది. మొత్తం 631.5 పాయింట్లు సాధించి 5వ స్థానంలో నిలచి ఫైనల్‌కు అర్హత సాధించింది. భారత్ 2020 ఒలింపిక్స్ లో 7 పతకాలు సాధించి 48 స్థానంలో నిలిచింది. ఇందులో ఒక స్వర్ణం, రెండు రజితాలు, 4 కాంస్య పతకాలు ఉన్నాయి.












Click it and Unblock the Notifications