క్లియర్ పిక్చర్.. ప్లేఆఫ్స్ చేరిన నాలుగో జట్టు ఇదే
IPL 2025 Playoffs: ఐపీఎల్ 2025లో ముంబై ఇండియన్స్.. ఘన విజయాన్ని సాధించింది. ఢిల్లీ కేపిటల్స్ ను మట్టికరిపించింది. ప్లేఆఫ్స్ లో అడుగు పెట్టింది. ఈ ఓటమితో ఢిల్లీ కేపిటల్స్.. ప్లే ఆఫ్స్ రేసు నుంచి వైదొలిగింది. ఈ సీజన్ లో ప్లేఆఫ్స్ నుంచి తప్పుకొన్న చిట్టచివరి జట్టు ఇదే.
టాస్ ఓడిపోయి తొలుత బ్యాటింగ్ కు దిగింది ముంబై. నిర్ణీత 20 ఓవర్లల్లో అయిదు వికెట్ల నష్టానికి 180 పరుగులు చేసింది. అనంతరం బరిలోకి దిగిన ఢిల్లీ కేపిటల్స్ చేతులెత్తేసింది. ముంబై బౌలర్ల ధాటికి తలవంచింది. 121 పరుగులకు ఆలౌట్ అయింది. 59 పరుగుల తేడాతో ముంబై చేతిలో చిత్తయింది.

ముంబై ఇన్నింగ్ లో టాప్ స్కోరర్.. సూర్యకుమార్ యాదవ్. తనదైన శైలిలో విరుచుకుపడ్డాడీ ముంబైకర్. నమన్ ధీర్ తో కలిసి స్టేడియంలో విధ్వంసాన్ని సృష్టించాడు. 43 బంతుల్లో నాలుగు భారీ సిక్సర్లు, ఏడు బుల్లెట్ల వంటి ఫోర్లతో 73 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు.
రోహిత్ శర్మ ఈ మ్యాచ్ లో కూడా ఘోరంగా విఫలం అయ్యాడు. అయిదు పరుగులే చేసి అవుట్ అయ్యాడు. ముస్తాఫిజుర్ రెహ్మాన్ బౌలింగ్ లో వికెట్ కీపర్ అభిషేక్ పొరెల్ కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. మరో ఓపెనర్ రియాన్ రికెల్టన్- 25, టాప్ ఆర్డర్ బ్యాటర్ విల్ జాక్స్- 21, తిలక్ వర్మ- 27, కేప్టెన్ హార్దిక్ పాండ్యా- 3 పరుగులు చేశారు.
చివర్లో నమన్ ధీర్ సుడిగాలి ఇన్నింగ్ ఆడాడు. 8 బంతులను ఎదుర్కొన్న ఈ బ్యాటర్ ఏకంగా 24 పరుగులు సాధించాడు. ఇందులో రెండు చొప్పున ఫోర్లు, సిక్సర్లు ఉన్నాయి. సూర్యకుమార్ యాదవ్, నమన్ ధీర్ చివరి రెండు ఓవర్లల్లో తుఫాన్ లా విరుచుకుపడ్డారు బౌలర్లపై. చెలరేగి ఆడారు.
ఈ చివరి రెండు ఓవర్లల్లోనే ఏకంగా 48 పరుగులు పిండుకున్నారంటే వాళ్ల బ్యాటింగ్ తీవ్రత ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. పోటీ పడి సిక్సర్లు, బౌండరీలు బాదారు.ముఖేష్ కుమార్ వేసిన 19వ ఓవర్ లో 27 పరుగులు రాబట్టుకున్నారు. ఆ ఓవర్ తొలి బంతిని సూర్యకుమార్ యాదవ్ సిక్స్ గా మలిచాడు. రెండో బంతికి సింగిల్ తీశాడు. ఆ తరువాత చివరి నాలుగు బంతుల్లో నమన్ ధీర్ 20 పరుగులు రాబట్టుకున్నాడు. 4,6,6,4 కొట్టాడా నాలుగు బంతుల్లో.
దుష్మత చమీరా వేసిన చివరి ఓవర్ లోనూ ఇదే పరిస్థితి కనిపించింది. తొలి బంతిని బౌండరీకి పంపించిన సూర్యకుమార్ యాదవ్.. 3, 4 బంతుల్లో వరుసగా రెండు సిక్సర్లు కొట్టాడు. అయిదో బంతిని బౌండరీ దాటించాడు. ఆరో బంతికి సింగిల్ తీశాడు. 19 ఓవర్ ఆరంభానికి ముందు 132 పరుగుల మీద ఉన్న ముంబై ఇండియన్స్ స్కోర్.. ఈ చివరి రెండు ఓవర్లు ముగిసే సరికి 180కి చేరింది.
ఢిల్లీ ఇన్నింగ్ లో ఏ ఒక్క బ్యాటర్ కూడా చెప్పుకోదగ్గ స్కోర్ చేయలేదు. 39 పరుగులు చేసిన సమీర్ రిజ్వీ ఒక్కడే టాప్ స్కోరర్. కేఎల్ రాహుల్ సహా అందరూ విఫలం అయ్యారు. కేఎల్ రాహుల్- 11, ఫాఫ్ డుప్లెసిస్- 6, అభిషేక్ పోరెల్- 5, విప్రజ్ నిగమ్- 20, ట్రిస్టన్ స్టబ్స్- 2, అశుతోష్ శర్మ- 18, మాధవ్ తివారీ- 3, దుష్మంత చమీరా - 8 (నాటౌట్), కుల్ దీప్ యాదవ్- 7, ముస్తాఫిజుర్ డకౌట్ అయ్యారు.
ముంబై బౌలర్లు మిఛెల్ శాంట్నర్, జస్ ప్రీత్ బుమ్రా మూడేసి చొప్పున వికెట్లు పడగొట్టారు. ట్రెంట్ బౌల్ట్, దీపక్ చాహర్, విల్ జాక్స్, కర్ణ్ శర్మ ఒక్కో వికెట్ తీసుకున్నారు. ఈ గెలుపుతో ముంబై ఇండియన్స్ ప్లేఆఫ్స్ లో చేరింది.
గుజరాత్ టైటాన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, పంజాబ్ కింగ్స్ తరువాత ముంబై ఇండియన్స్ ప్లేఆఫ్స్ లో అడుగు పెట్టింది. ఢిల్లీ కేపిటల్స్, కోల్ కత నైట్ రైడర్స్, లక్నో సూపర్ జెయింట్స్, సన్ రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్, చెన్నై సూపర్ కింగ్స్.. ఇంటిదారి పట్టాయి.
ఈ నెల 29వ తేదీన ప్లేఆఫ్స్ ఆరంభం కానున్నాయి. తొలి క్వాలిఫయర్ ముల్లాన్ పూర్ లో జరుగనుంది. 30వ తేదీన అదే ముల్లాన్ పూర్ లో ఎలిమినేట్ ఉంటుంది. క్వాలిఫయర్ 2 అహ్మదాబాద్ లో షెడ్యూల్ అయింది. జూన్ 1వ తేదీన జరుగుతుందీ మ్యాచ్. అదే నెల 3వ తేదీన అహ్మదాబాద్ లోనే ఫైనల్.
-
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
తెలంగాణ నూతన డీజీపీ ఖరారు, అనూహ్య ఎంపిక..!! -
న్యూజిలాండ్ ఫస్ట్ సిరీస్- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత జట్టులో భారీ మార్పలు -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం -
"ఆయన్ను తట్టుకోలేక నరకం చూశా.. 16 సినిమాలు తిరస్కరించా" -
రిలయన్స్ ఇండస్ట్రీస్ బంపర్ ఆఫర్ ఇచ్చిన డొనాల్డ్ ట్రంప్ -
ఉప ప్రధానిగా చంద్రబాబు: వైఎస్ జగన్ రియాక్షన్












Click it and Unblock the Notifications