Force Majeure: భారత్-పాక్ మ్యాచ్ చర్చల్లో కొత్త ట్విస్ట్..! ఏంటీ ఫోర్స్ మెజ్యూర్ ?
టీ20 వరల్డ్ కప్ లో భాగంగా భారత్-పాకిస్తాన్ (india-pakistan) జట్ల మధ్య ఈ నెల 15న గ్రూప్ దశ మ్యాచ్ కొలంబోలో జరగాల్సి ఉంది. ఇవాళ ప్రారంభమైన టీ20 వరల్డ్ కప్ మొత్తానికి ఈ మ్యాచ్ చాలా కీలకం. ఈ ఒక్క మ్యాచ్ ద్వారానే దాదాపు రూ.4500 కోట్ల ఆదాయం లభించబోతోంది. దీంతో ఈ మ్యాచ్ జరగకపోతే భారత్, పాక్ బోర్డులతో ఐసీసీ, మ్యాచ్ ప్రచారకర్తలు, మరో ఆతిధ్య దేశం శ్రీలంక, ఇలా చాలా మందిపైనే ప్రభావం పడబోతోంది. ఈ నేపథ్యంలో ఐసీసీ ప్రస్తుతం పాకిస్తాన్ బోర్డుతో తుది దఫా చర్చలు జరుపుతోంది.
భారత్ తో మ్యాచ్ ఆడకుండా పాక్ కుయుక్తులు
టీ20 వరల్డ్ కప్ ఆడుతున్నా కేవలం భారత్ తో మ్యాచ్ మాత్రమే ఆడకుండా తప్పించుకునేందుకు పాక్ కుయుక్తులు పన్నుతోంది. ఇందులో భాగంగానే పాకిస్తాన్ క్రికెట్ బోర్డు తాము నిర్ణయం తీసుకోకుండా తమ ప్రభుత్వంతో ఈ మ్యాచ్ ఆడట్లేదని చెప్పించింది. ఇదంతా ఐసీసీ నిబంధనల్లో ఉన్న ఓ కీలక నిబంధనను అడ్డుపెట్టుకుని ఈ మ్యాచ్ ఆడకుండా తప్పించుకునేందుకే. ఈ నిబంధనే ఫోర్స్ మెజ్యూర్ (force majeure). ఇంతకీ ఈ నిబంధన ఏంటి ?, ఈ నిబంధన పాకిస్తాన్ పై తదుపరి చర్యలు తీసుకోకుండా ఐసీసీ చేతుల్ని కట్టేస్తుందా ?

ఫోర్స్ మెజ్యూర్ నిబంధన (force majeure)
ఫోర్స్ మెజ్యూర్ అనేది ఐసీసీకి ఉన్న సవాలక్ష నిబంధనల్లో కీలకమైన క్లాజ్. ఇది యుద్ధం, ప్రకృతి వైపరీత్యాలు, ప్రభుత్వ చర్యలు, ప్రజా అత్యవసర పరిస్థితులు వంటి తమ చేతుల్లో లేని నిర్ణయాల కారణంగా ఓ జట్టు తన బాధ్యతలను నెరవేర్చకుండా తప్పించుకునేందుకు వీలు కల్పిస్తుంది. ఈ నిబంధన వర్తించాలంటే, ఆ నిర్ణయం ఊహించలేనిది, అనివార్యమైనది, దాని ప్రభావాన్ని తగ్గించడానికి వారు అన్ని సహేతుకమైన చర్యలు తీసుకున్నారని బాధిత పార్టీ నిరూపించుకోవాల్సి ఉంటుంది. కేవలం అసౌకర్యం లేదా రాజకీయ ప్రాధాన్యతల్ని సాకుగా చూపితే సరిపోదు. దీన్నే ఇప్పుడు పాకిస్తాన్ వాడుతోంది.

పాక్ వివరణ కోరిన ఐసీసీ
ఫోర్స్ మెజ్యూర్ నిబంధనను సాకుగా చూపుతూ భారత్ తో గ్రూప్ దశ మ్యాచ్ ఆడేందుకు పాకిస్తాన్ నిరాకరిస్తోంది. అయితే ఈ నిర్ణయం తమ ప్రభుత్వం తీసుకుందని పీసీబీ చెబుతోంది. దీంతో ఐసీసీ ఇప్పుడు ఆ ఒక్క మ్యాచ్ ఆడకుండా మిగతా మ్యాచ్ లు ఎలా ఆడతారు, ఒక వేళ భారత్ సూపర్ 8, సెమీస్, ఫైనల్ కు చేరుకుంటే.. ఇప్పుడు మీ స్టాండ్ ఏంటి ? ఇలా పలు ప్రశ్నల్ని పాకిస్తాన్ క్రికెట్ బోర్డుకు సంధిస్తోంది. తమ ప్రభుత్వ నిర్ణయాన్ని విరమింపజేసేలా చేసేందుకు మీరు తీసుకున్న చర్యలేంటని కూడా అడుగుతోంది. దీంతో పాకిస్తాన్ బోర్డు .. తమ ప్రభుత్వంతో దీనిపై చర్చిస్తున్నట్లు చెబుతోంది.
-
గోరు వెచ్చని నీటిలో నిమ్మరసం కలిపి తాగుతున్నారా - అయితే, ఇది మీ కోసమే..!! -
భారత్ కు మెషిన్ గన్స్ పంపించిన ఇజ్రాయెల్.. పాకిస్థాన్ పని ఖతం.. -
భారత్ కు గుడ్ న్యూస్ చెప్పిన పాకిస్థాన్ -
లీటర్ పెట్రోల్ రూ. 321, కిరోసిన్ రూ. 433, డీజిల్ రూ. 345.. ఎమర్జెన్సీ ప్రకటన.. -
Pakistan: ఏప్రిల్ 4 నుంచి లాక్ డౌన్..? సంచలన నిర్ణయం దిశగా ప్రభుత్వం.. -
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
మళ్లీ మొదలెట్టావా పాప.. ప్రెగ్నెన్సీ నిజమేనా? -
Tamil Nadu Survey: తమిళనాడు పోరు ఏకపక్షమే- తేల్చేసిన లోక్ పోల్ సర్వే..! -
విజయ్ దేవరకొండపై ఆ స్టార్ హీరో భార్య సీక్రెట్ లవ్.. పెళ్లయినా ఆగని..! -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
తాజా కోడిగుడ్డును గుర్తుపట్టడం ఇక ఈజీ












Click it and Unblock the Notifications