విరాట్ కోహ్లీ వికెట్‌తో స్టేడియం లైబ్రరీలా మారింది...
వన్డే ప్రపంచకప్ 2023 ఫైనల్లో టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ వికెట్ పడిన క్షణాలను జీవితంలో తాను ఎప్పటికీ మర్చిపోనని ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమిన్స్ అన్నారు. జీవితంలోని చివరిదశలో ఉన్నప్పుడు కూడా తనకు కోహ్లీ వికెట్ గుర్తుంటుందన్నాడు. వన్డే ప్రపంచకప్ ఫైనల్స్ అహ్మాదాబాద్‌లోని నరేంద్రమోడీ స్టేడియంలో జరిగిన సంగతి అందరికీ తెలిసిందే.. ఐసీసీ వన్డే వరల్డ్ కప్ లో ఆసీస్ జట్టు ఫైనల్లో భారత్‌ను ఓడించి చాంపియన్ గా నిలిచింది. ఈ క్రమంలో ఆసీస్ సారథి కమిన్స్ ఓ ఇంటర్వ్యూలో కోహ్లీ వికెట్ గురించి కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
ఆ రోజు విరాట్ కోహ్లీ వికెట్‌తో ఆ స్టేడియం అంతా లైబ్రరీలా నిశ్శబ్దంగా మారిందని, ఆ దృశ్యాన్ని, ఆ వికెట్‌ను తను జీవితంలో ఎప్పుడూ మరిచిపోలేనని అన్నాడు. ఫైనల్లో కోహ్లీ వికెట్ పడగొట్టడం తనకు అత్యంత మధుర స్మృతి అని అన్నాడు. 70 ఏళ్లు దాటాక కూడా కోహ్లీ వికెట్ ను గుర్తు చేసుకుంటానని ఈ సందర్భంగా కమిన్స్ అన్నాడు. నవంబర్ 19న జరిగిన ఫైనల్లో ఆసీస్ చేతిలో భారత్ ఓడిపోయిన విషయం విదితమే. భారత్ నిర్ధేశించిన 241 పరుగుల లక్ష్యాన్ని ఆసీస్ 7 ఓవర్లు ఉండగానే ఛేదించి మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది.

'ఒక్కసారి మైదానాన్ని చూడండి' : అయితే, ఈ క్రమంలో మెల్‌బోర్న్‌లో 'ది ఏజ్'కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్యాట్ కమిన్స్ ఫైనల్ గురించి పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు. '70 ఏళ్లు దాటిన తర్వాత మీరు మరణించే ముందు 2023 ఫైనల్ మ్యాచ్‌లో ఏ క్షణాల గురించి ఆలోచిస్తారు?' అని యాంకర్ పీటర్ ఫిట్జ్ సైమన్స్ అడిగిన ప్రశ్నకు... కమిన్స్ చెప్పిన సమాధానం...'విరాట్ కోహ్లీ వికెట్ గురించి ఆలోచిస్తా' అని చెప్పారు. తనకు జీవితంలో అత్యంత అద్భుతమైన, సంతోషమైన క్షణం కోహ్లీ వికెట్ పడినప్పుడే అని అన్నాడు. విరాట్ కోహ్లీ వికెట్ పడిన సమయంలో నాకు చాలా సంతోషంగా అనిపించింది. విరాట్ వికెట్ తీసిన తర్వాత మా ఆటగాళ్లు అందరం కలిసి ఒక చోటుకి చేరుకున్నాం. అప్పుడు స్టీవ్ స్మిత్ 'ఒక్కసారి మైదానాన్ని చూడండి' అని మాతో అన్నాడు. ఆ క్షణం స్టేడియంలో దాదాపు లక్షలాది మంది భారత అభిమానులంతా ఒక్కసారిగా సైలెంట్ అయిపోయారు. ఆ సమయంలో నరేంద్ర మోడీ మైదానం లైబ్రరీలా నిశ్శబ్దంగా మారిపోయింది. ఆ క్షణాలను నేను ఎప్పటికి మరిచిపోను. చాలా కాలం పాటు ఆ క్షణాలను ఆస్వాదిస్తాను' అని ప్యాట్ కమిన్స్ అన్నాడు.












Click it and Unblock the Notifications