IPL 2024: ధోనీకి ఇదే చివరి ఐపీఎల్ సీజనా ? బాల్య స్నేహితుడి అంచనా ఇదే..!
ఈసారి ఐపీఎల్ (IPL 2024)లో డిఫెండింగ్ ఛాంపియన్ గా బరిలోకి దిగుతున్న చెన్నై సూపర్ కింగ్స్ జట్టుపై కంటే దానికి నేతృత్వం వహిస్తున్న కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనిపైనే ఎక్కువగా చర్చ జరుగుతోంది. ఎందుకంటే చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఇప్పటికే రికార్డు స్దాయిలో ఐదుసార్లు ఐపీఎల్ టైటిల్స్ గెల్చుకుని ముంబై ఇండియన్స్ తో సమంగా ఉంది. ఈసారి కూడా గెలిస్తే ఆరోసారి గెలిచి రికార్డు బద్దలు కొడుతుంది. కానీ చెన్నై టైటిల్ గెలవాలంటే మహేంద్ర సింగ్ ధోనీ ఎంతో కీలకం.
ఈసారి ఐపీఎల్ టైటిల్ గెలిస్తే చెన్నైకు వచ్చే రికార్డు కంటే ఈ టోర్నీ తర్వాత మహేంద్ర సింగ్ ధోనీ రిటైర్మెంట్ ప్రకటించబోతున్నాడనే చర్చ తీవ్రంగా జరుగుతోంది. ఎందుకంటే గతంతో పోలిస్తే ధోనీ ఫిట్ నెస్ తగ్గుతోంది. మార్కెటింగ్ తో వచ్చే ఆదాయం ఉండనే ఉంది. కాబట్టి ఐపీఎల్ కు ధోనీ గుడ్ బై చెప్పేస్తాడనే చర్చ జరుగుతోంది. అయితే దీన్ని ఇప్పటికే ధోనీ సహచరులు కూడా ఖండించారు. కానీ చర్చ మాత్రం ఆగడం లేదు. ఈ నేపథ్యంలో ధోనీ బాల్య స్నేహితుడు పరమ్ జీత్ సింగ్ స్పందించాడు.

"Dhoni will play one more season after IPL 2024"
— Div🦁 (@div_yumm) March 1, 2024
~ MS Dhoni's friend Paramjit Singh pic.twitter.com/zwJY0WjML2
మహేంద్ర సింగ్ ధోనీని క్రికెట్ లోకి తెచ్చినట్లుగా చెప్పే బాల్య స్నేహితుడు పరమ్ జీత్ సింగ్ తాజాగా వన్ క్రికెట్ అనే వెబ్ సైట్ కు ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఇందులో తన బాల్య స్నేహితుడు మహేంద్ర సింగ్ ధోనీ రిటైర్మెంట్ పై తన అంచనాల్ని వెల్లడించాడు. ఇందులో పరమ్ జీత్ సింగ్.. ధోనీకి ఇది చివరి సీజన్ అవుతుందని తాను భావించడం లేదన్నాడు. ధోనీ ఇంకా ఫిట్ గానే ఉన్నాడని, మరో ఒకట్రెండు సీజన్లు ఆడే అవకాశం ఉందని తెలిపాడు. ప్రస్తుత ధోనీ ఫిట్ నెస్ చూస్తుంటే కనీసం మరో సీజన్ అయినా ఆడతాడని పరమ్ జీత్ అంచనా వేశాడు.












Click it and Unblock the Notifications