• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

సవాళ్ళు ఎన్నో...

By Staff
|
హోంపేజి టాక్‌ ఆఫ్‌ టుడే కాంగ్రెస్‌ Friday, May 14 2004

హైదరాబాద్‌: రాష్ట్ర ముఖ్యమంత్రిగాడాక్టర్‌ వైఎస్‌ రాజశేఖరరెడ్డి ప్రమాణస్వీకారం చేసినవెంటనే ఒక విలువైన మాట చెప్పారు. కాంగ్రెస్‌, మిత్రపక్షాలనాయకులు నిరాడంబరంగా ఉండాలని ఆయన సూచించారు. ఇంతకాలంకష్టాలు పడిన సామాన్యుల మొహాల్లో ఆనందం కన్పించేంతవరకుకష్టపడి చిత్తశుద్ధితో పనిచేయాలని ఆయన ఉద్వేగపూరితంగాచెప్పారు.

రాజశేఖరరెడ్డి నేడు ధరించిందిముళ్ళ కి రీటం. కొత్త ప్రభుత్వం నుంచి ప్రజలు ఎంతో ఆశిస్తున్నారని, వారిఆకాంక్షలను తీర్చగలనా అన్న భయం తనకు ఉందని ఆయనఅన్నారు. పదకొండు వందల కోట్ల విద్యుత్‌బకాయిలను శుక్రవారం ఒక్క కలం పోటుతో రద్దుచేశారు. రైతులకు ఉచిత విద్యుత్‌ ఇవ్వడానికి ఏటా మూడొందలయాభై కోట్ల రూపాయలు ఖర్చవుతాయని ఒక అంచనా. రాష్ట్ర ఆర్ధికపరిస్ధితి అంతంత మాత్రంగా ఉంది. అవినీతి తీవ్రస్ధాయిలో ఉంది. వైఎస్‌విద్యుత్‌ నిర్ణయాలు సామాన్యులకు తక్షణ ఉపశమనం కలిగించిఉంటాయి. ఇది చిన్న అడుగు మాత్రమే.

సంపన్నుల ప్రభుత్వంగా ముద్రపడినతెలుగుదేశంను ప్రజలు తిరస్కరించి రాజశేఖరరెడ్డి మీదనమ్మకం ఉంచారు. కాంగ్రెస్‌ పార్టీకున్న సహజ లక్షణంక్రమశిక్షణ రాహిత్యం. కొత్త ముఖ్యమంత్రి తన పార్టీ శ్రేణులధోరణిని మార్చడానికి కృషి చేయాలి. కాంగ్రెస్‌లొ ఉన్న పైరవీలసంస్కృతికి అడ్డుకట్ట వేయాలి. గతం అంతా చెడ్డది కాదని కూడాగ్రహించాలి. చంద్రబాబు నాయుడు హయాంలో జరిగిన మంచి పనులనుకొనసాగించాలి.

ఇప్పుడు మారాల్సింది ప్రభుత్వప్రాధమ్యతలే. బహుళజాతి సంస్ధలకు ప్రభుత్వ భూములుకేటాయించడం, ప్రభుత్వంలో సిఎం నుంచి కానిస్టేబుల్‌ పనులవరకు తానే చేయడం, అభివృద్ధికి సంబంధించిన డాక్యుమెంట్ల పనులుచేసుకోవడం, వీడియో కాన్ఫరెన్సులతో రోజుకు పద్దెనిమిది గంటలుచంద్రబాబు నాయుడు బిజీగా ఉండేవారు. వైఎస్‌ అన్ని గంటలుపనిచేయనవసరం లేదు. సామాన్యుల సమస్యల మీదసానుభూతి ఉన్న నిజాయితీ పరులైన మేధావులను ఆయనసలహాదారులుగా పెట్టుకోవాలి. చంద్రబాబు నాయుడిప్రాధమ్యతలను నిర్ణయించింది ఐఎఎస్‌ అధికారులే.బ్యురాక్రాట్ల సలహాలకు ఆయన విలువ ఇచ్చారు. దాని ఫలితంగానేప్రభుత్వం క్రమంగా సంపన్నుల అనుకూల ప్రభుత్వంగామారిపోయింది.

నిత్యం బిజీగా ఉండే ముఖ్యమంత్రులకుఆలోచించడానికి సమయం ఉండదు. మెరుగైన సమాజం కోసంఏంచేస్తే బాగుంటుందో ముఖ్యమంత్రులు సొంతంగా ఆలోచించగలగాలి.సంపదను సృష్టించడానికి మార్గాలను అన్వేషించడం రాష్ట్రదీర్ఘకాలిక ప్రయోజనాల రీత్యా అత్యవసరం. ఉపాధి,వ్యవసాయరంగాలకు ఆయన ప్రాధాన్యం ఇవ్వబోతున్నారు.

ఆర్ధికసంస్కరణలుకొనసాగవలసిందేకానీ వాటికి మానవీయత ఉండాలి.సంస్కరణలను మధ్యలో ఆపేయడం వల్ల వ్యతిరేక ఫలితాలువస్తాయి. ప్రపంచబ్యాంకు రుణాలతో కొనసాగుతున్నప్రాజెక్టులను ఆపే వీలు ఉండదు. సేద్యపునీటి వనరుల కోసం ఆయనవివిధ ఆర్ధిక సంస్ధల నుంచి నిధులను సమకూర్చుకోవలసి ఉంటుంది. హోంపేజి

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X