టాప్‌ఆర్డర్‌పై కైఫ్‌ కన్ను

హోంపేజి టాక్‌ ఆఫ్‌ టుడే కాంగ్రెస్‌ Tuesday, September 07 2004

లండన్‌:టాప్‌ బ్యాట్స్‌మన్‌ సచిన్‌ టెండూల్కర్‌ఆటకు దూరం కావడం మహ్మద్‌కైఫ్‌కు కలిసి వస్తుందా? కైఫ్‌ వాలకంచూస్తుంటే అలాగే అనిపిస్తోంది. బ్యాటింగ్‌ఆర్డర్‌లో పైకి ఎగబాకడం ద్వారాతన ప్రతిభకు మెరుగులుపెట్టుకోవాలనుకుంటున్నాడు.ఇంగ్లాండుతో జరిగిన నాట్‌వెస్ట్‌ వన్డేసిరీస్‌లో రెండు అర్థ సెంచరీలు చేసినకైఫ్‌కు ఆత్మవిశ్వాసం కాస్తా పెరిగినట్లేఉంది.

ఇరవైమూడేళ్ల కైఫ్‌ బ్యాటింగ్‌ ఆర్డర్‌లోఎగబాకిన తర్వాత మొదటిరెండు వన్డేల్లో యాబై, యాబై ఒక్కపరుగు చేశాడు. ఈ ఫామ్‌తో అతనుముందుకు సాగాలని అనుకుంటున్నాడు.నాట్‌వెస్ట్‌వన్డే సిరీస్‌లో ఇంగ్లాండుపై కైఫ్‌ మినహామరెవరూ రెండు అర్థ సెంచరీలుచేయలేదు. టాప్‌ ఆర్డర్‌లోబ్యాటింగ్‌కు దాన్ని బాగావాడుకున్నాడు.

"అవకాశంవస్తే జట్టులో నిలదొక్కుకోవడానికిఎవరైనా ఎక్కువ ఓవర్లనుఎదుర్కోవాలని అనుకుంటారు.అటువంటప్పుడు ఏడో స్థానంలో ఆడటం చాలాకష్టమైన పని, మైకెల్‌ క్లార్క్‌ కూడాఅదే అంటున్నారు అని కైఫ్‌ పిటి ఐప్రతినిధితో అన్నారు. " మొదటిపదిహేను ఓవర్లలో బ్యాటింగ్‌కుదిగడం వల్ల ఉపయోగం ఉంటుంది. రింగ్‌నుదాటించగలిగితే బంతి బౌండరీ దాటుతుంది.ఫీల్డింగ్‌ విస్తరిస్తే బంతిని కొట్టడానికి గ్యాప్‌లువెతుక్కోవడం కష్టమవుతుందిఅని అతను అభిప్రాయపడుతున్నాడు.తనకు కొత్త బంతిని ఎదుర్కున్నఅనుభవం ఉన్నదని, ఇండియా ఎటీమ్‌లో తాను కొత్త బంతిని ఎదుర్కున్నానిఅతను చెప్పాడు. ఈ మాటలను బట్టి కైఫ్‌ఆర్డర్‌లో రావడానికి ఎంతగాఇష్టపడుతున్నాడోఅర్థమవుతుంది.

తనకుఆనందంగా ఉన్నదని, విశ్వాసంపెరిగిందని, బంతిని సరిగాఆడగలుగుతున్నానని, తాను ఏస్థానంలో అయినా ఫరవాలేదని, అది టీమ్‌మేనేజ్‌మెంట్‌పై ఆధారపడిఉంటుందని కైఫ్‌ చెప్తున్నాడు. మంచిఫీల్డర్‌ కావడం కూడా వన్డేల్లో స్థానంవిషయంలో కైఫ్‌కు కలిసి వచ్చింది.

Recent Stories
పారితోషికాలుతగ్గింపు?


వేడెక్కిన సిద్ధిపేట
గాంధీజీ చివరి అడుగులు
పనివాళ్ళ పనికాదు
పులిరాజాఏమయ్యాడు?
చిత్ర హింస
కెసిఆర్‌ఏం చేస్తున్నట్లు?
రాజకీయరంగులు

చంద్రబాబుశైలి బాట
పరిటాలకథ హోంపేజి
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+