కెసిఆరేపెద్ద ఫ్యాక్టర్
హోంపేజి
టాక్ ఆఫ్ టుడే
రాజకీయాలు Monday, April 19 2004
హైదరాబాద్: మొదటివిడతపోలింగ్‌కు ఇంకా కొన్ని గంటల వ్యవధే ఉండగా ఎన్నికలవిశ్లేషకులకు ఆంధ్రప్రదేశ్ ఒక పజిల్ గా ఉంది. పంచాయితీఎన్నికల్లో ఇరవైశాతం ఓట్లు తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్ర సమితివ్యవహారం ఉత్తరాది ఎన్నికల విశ్లేషకులకు అంతు చిక్కడంలేదు. వారు ఎంతవరకు తెలంగాణ సెంటిమెంట్ ఈ ప్రాంతంలోబాగా వ్యక్తమయితే ఆ మేరకు కాంగ్రెస్‌కు కోస్తా ఆంధ్రలోకాంగ్రెస్ నష్టపోతుందని వాళ్ళు గుడ్డిగా లెక్కలు వేస్తున్నారు.ఈ లెక్కల్లో హేతుబద్ధత కన్పించడం లేదు.
కాంగ్రెస్ పార్టీ మీద వైఎస్‌రాజశేఖరరెడ్డి మీద సానుభూతి వ్యక్తమవుతున్నా అది పూర్తిమెజారిటీ ఇచ్చేటంతగా ఉన్నదా అన్నది ప్రశ్న. అలాగే తొమ్మిదేళ్ళుపరిపాలించిన తెలుగుదేశం మీద ప్రభుత్వ వ్యతిరేకత ఉంది కానీఅది చెప్పుకోదగినంత స్ధాయిలో లేదు. ఇప్పుడు దేశంలో కెల్లాఆంధ్రప్రదేశ్ ఫలితాలు ఆశ్చర్యంగా ఉంటాయని ది హిందూతదితర అగ్రశ్రేణి పత్రికలకు, టీవీ ఛానళ్ళకు ఎన్నికలవిశ్లేషకుడిగా ఉన్న యోగేంద్రయాదవ్ అభిప్రాయపడ్డారు.
తెలంగాణలొ తెరాస, కాంగ్రెస్ లకుఅనుకూలమైన గాలి ఉందని స్ధానిక విశ్లేషకులు చెబుతున్నారు.కోస్తాలో కూడా చంద్రబాబు నాయుడికి పెట్టని కోటలా ఉన్న రెండుఅగ్రకులాల ఓట్లు ఈసారి కాంగ్రెస్ టిడిపిల మధ్య చీలిపోతాయన్నఒక అంచనా ఉంది. మొత్తమ్మీద ఏపార్టీకి ప్రభంజనం లేని ఎన్నికలివి.
- పార్టీ టికెట్ల మార్కెటింగు
- చిరంజీవిరహస్య ఎజెండా?
- అస్పష్ట రాజకీయ చిత్రం హోంపేజి












Click it and Unblock the Notifications
